రివ్యూ: కేరాఫ్ కంచర‌పాలెం

CRITICS METER

Average Critics Rating: 4
Total Critics:4

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 4.00 out of 5)
Loading...
movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

C/o Kancharapalem – Emotional, entertaining and eventful experience
Rating: 3.5/5

www.teluguodu.com

C/o Kancharapalem – Touches your Heart
Rating: 3.5/5

www.123telugu.com

Small film with large heart
Rating: 3.25/5

www.thehindu.com

C/O Kancharapalem raises a toast to sincere, uncinematic storytelling
Rating: 4/5

www.timesofindia.com

రివ్యూ           : కేరాఫ్ కంచర‌పాలెం
న‌టీన‌టులు     : సుబ్బారావ్, రాధాబెస్సి, కేశ‌వ క‌ర్రి, నిత్య‌శ్రీ గోరు, కార్తిక్ ర‌త్నం, విజ‌య ప్ర‌వీణ‌, మోహ‌న్ భ‌గ‌త్, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్..
సంగీతం         : స‌్వీక‌ర్ అగ‌స్తి
సినిమాటోగ్రఫర్ : ఆదిత్య జ‌వ్వాడి అండ్ వ‌రుణ్ ఛాపేక‌ర్
ఎడిటర్         : రవితేజ గిరిజిల
దర్శకత్వం      : వెంకటేశ్ మ‌హా
స‌మ‌ర్ప‌ణ‌       : ద‌గ్గుపాటి రానా
నిర్మాత         : విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి

కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు కేరాఫ్ కంచ‌ర‌పాలెం. మూడు నెల‌ల నుంచి వ‌ర‌స ప్రీమియ‌ర్స్ వేస్తూనే ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి అంత న‌మ్మ‌కం ఏంటి ఈ సినిమాపై వాళ్ల‌కు..? ప‌్రేక్ష‌కుల‌కు కూడా నిజంగానే ఈ సినిమాలో అంత బాగా న‌చ్చే అంశాలున్నాయా..?

కథ :
రాజు ఓ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస్ లో అటెండ‌ర్. అత‌డికి 50 ఏళ్ళొచ్చినా పెళ్లి కాదు. అలాంటి వాడి జీవితంలోకి ఓ ఆఫీస‌ర్ వ‌స్తుంది. వ‌చ్చీ రాగానే ప్రేమిస్తున్నానంటుంది. 42 ఏళ్ల ఆమెకు 20 ఏళ్ల కూతురు ఉంటుంది. అలాంటి వ్య‌క్తుల మ‌ధ్య ప్రేమ పుడుతుంది. ఈ ప్రేమ‌క‌థ‌తో పాటే మరో మూడు ప్రేమ‌క‌థ‌లు కూడా కంచ‌ర‌పాలెంలోనే జ‌రుగుతుంటాయి. ప‌దేళ్ల సునీత- సుందరం.. 20 ఏళ్ల జంట జోసెఫ్- భార్గవి.. 30 ఏళ్ల జంట‌ గడ్డం- సలీమా ప్రేమకథలు కూడా ఉంటాయి. అస‌లు వీళ్లంతా ఎవ‌రు.. క‌లిసారా లేదా.. స‌మాజంలో జ‌రుగుతున్న కుల‌మ‌త బేధాల‌కు వీళ్ళ ప్రేమ‌ల‌తో సంబంధం ఏంటి అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
ఈ రోజుల్లో రెండు రోజుల ముందు ప్రీమియ‌ర్ వేయ‌డానికే భ‌య‌ప‌డుతుంటారు నిర్మాత‌లు. అలాంటిది మూడు నెల‌ల ముందు నుంచి అంద‌రికీ ప్రీగా షోలు వేసి కేరాఫ్ కంచ‌ర‌పాలెం షో లు చూపిస్తున్నాడు నిర్మాత సురేష్ బాబు. అంటే ఆయ‌న‌కు సినిమాపై ఎంత న‌మ్మ‌కం ఉండాలో ఒక్క సారి ఆలోచించండి. సినిమా చూసిన వాళ్ళంతా కొత్త కుర్రాడైనా ఏం తీసాడ్రా బాబు అంటూ పొగుడుతుంటే ఎక్క‌డ లేని ఆస‌క్తి అంద‌రిలోనూ క‌నిపిస్తుంది. విడుద‌ల‌కు ముందే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు ఎంపిక‌య్యేంత విష‌యం ఉందా అనే కూతుహ‌లం ఉంది. ఇన్నింటి మ‌ధ్య సివ‌రాఖ‌ర‌కి కేరాఫ్ కంచెర‌పాలెం సినిమా విడుద‌లైంది. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చూసి తుప్పుబ‌ట్టిన బుర్ర‌ల‌కు రీ ఫ్రెష్ మెంట్ ఇచ్చింది కేరాఫ్ కంచెర‌పాలెం. సినిమా చూద్దామ‌ని థియేటర్ లోకి వెళ్లిన ప్రేక్ష‌కుల‌కు.. అక్క‌డ తెరపై నాలుగు జీవితాలు క‌నిపిస్తాయి. కొత్త ద‌ర్శ‌కుడైనా భలే తీసాడ్రా అని సినిమా అయ్యేలోపు చాలా సార్లు అనుకుంటారు ప్రేక్ష‌కులు.

అక్క‌డ కోట్ల బ‌డ్జెట్ లేదు.. తెలిసిన మొహాలు లేరు.. ఫారెన్ పాట‌లు లేవు.. అయినా కూడా ఏదో తెలియ‌ని ఆస‌క్తి ప్ర‌తీ స‌న్నివేశంపై క‌లిగించాడు ద‌ర్శ‌కుడు వెంక‌టేశ్ మ‌హా. మారుతున్న తెలుగు సినిమాను మ‌రో మెట్టు ఎక్కించే విధంగానే ఉంది ఈ కేరాఫ్ కంచెర‌పాలెం. నటిస్తున్నారనే ఆలోచన కూడా రానీకుండా.. అంతా తమతమ పాత్రల్లో జీవించేసారు. సినిమా అంటే ఇలాగే తీయాల‌నే కంచెల‌ను తెంచేస్తూ.. కొత్త ద‌ర్శ‌కులు ఇలాంటి వినూత్న‌మైన ప్ర‌య‌త్నాలు చేయ‌డం హ‌ర్ష‌నీయ‌మే.

స్క్రీన్ ప్లేలో చిన్న లాక్ ఉంది కాబ‌ట్టి క‌థ గురించి వ‌ద్దు కానీ.. ఒక్క‌టి మాత్రం నిజం. ఈ సినిమా చూస్తున్నపుడు క‌చ్చితంగా ఏదో ఓ స‌మ‌యంలో మనకు మనం తెర‌పై కనిపిస్తాం. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే అద్భుతంగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు.. స్క్రీన్ ప్లే మాయాజాలంతో రెండున్న‌ర గంట‌ల సినిమా కూడా ఎక్క‌డా బోర్ కొట్ట‌లేదు. క‌మ‌ర్షియ‌ల్ గా ఈ సినిమా ఆడుతుందా ఆడ‌దా అనేది ప‌క్క‌న‌బెడితే క‌చ్చితంగా మంచి సినిమా. చిన్న‌పుడు మ‌నం పుస్త‌కాల్లో చ‌దువుకున్న వంశీ ప‌స‌ల‌పూడి క‌థ‌లు గుర్తొస్తుంది ఈ చిత్రం చూస్తుంటే.

న‌టీన‌టులు:
కంచ‌ర‌పాలెం అనే ఊళ్లో జ‌రిగిన క‌థ ఇది. ద‌ర్శ‌కుడు చాలా తెలివిగా అంతా ఊరు వాళ్ల‌నే తీసుకున్నాడు. కొత్త వాళ్లు కావ‌డంతో వాళ్ల పేర్ల కంటే కూడా పాత్రల పేర్లు ఎక్కువ‌గా గుర్తుంటాయి ప్రేక్ష‌కులు. ముఖ్యంగా రాజు పాత్రధారి ఈ సినిమాకు హీరో. ఆ త‌ర్వాత ఆయ‌న‌తో పాటు రాధా.. రాధా.. స‌లీమా.. గ‌డ్డం.. జోసెఫ్.. సునీత‌.. సుంద‌రం.. రామ్మూర్తి.. భార్గ‌వి.. అంతా త‌మ పాత్ర‌ల‌కు జీవం పోసారు. ద‌ర్శ‌కుడి న‌మ్మ‌కాన్ని అంతా క‌లిసి నిల‌బెట్టారు.

టెక్నిక‌ల్ టీం:
కేరాఫ్ కంచ‌ర‌పాలెం బ‌డ్జెట్ త‌క్కువ కావ‌చ్చు కానీ టెక్నిక‌ల్ ఔట్ పుట్ మాత్రం అద్భుత‌మే. ముఖ్యంగా స‌్వీక‌ర్ అగ‌స్తి ఇచ్చిన సంగీతం బాగుంది. ఈ సినిమాలోని ప్రతీపాట అల‌రిస్తుంది. ప‌చ్చ‌టి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం ఏంటో చూపిస్తుంది. ఇద్ద‌రు సినిమాటోగ్రఫర్స్ ఆదిత్య జ‌వ్వాడి మ‌రియు వ‌రుణ్ ఛాపేక‌ర్ త‌మ ప‌ని చ‌క్క‌గా చేసారు. కోటి రూపాయ‌లు కూడా లేని ఈ సినిమాకు వీళ్ల ఔట్ పుట్ సినిమా రేంజ్ పెంచింది. ఎడిటర్ రవితేజ గిరిజిల ప‌నితీరు బాగుంది. రానా ద‌గ్గుపాటి ఇలాంటి సినిమాను ఎంక‌రేజ్ చేయ‌డం మంచి విష‌యం. ద‌ర్శ‌కుడిగా వెంక‌టేశ్ మ‌హా తొలి సినిమాతోనే స‌త్తా చూపించాడు.

చివ‌రగా:
కేరాఫ్ కంచ‌ర‌పాలెం.. భావోద్వేగ పూరిత ప్ర‌యాణం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here