రివ్యూ: ఆట‌గాళ్లు

CRITICS METER

Average Critics Rating: 2
Total Critics:1

AUDIENCE METER

movie-poster
Release Date
August 24, 2018

Critic Reviews for The Boxtrolls

Aatagallu - Mediocre crime thriller
Rating: 2.25/5

www.teluguodu.com

రివ్యూ          : ఆట‌గాళ్లు
న‌టీన‌టులు    : నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబు, ద‌ర్శికా బానిక్, బ్ర‌హ్మానందం త‌దిత‌రులు
సంగీతం        : సాయికార్తిక్
ఎడిటింగ్        : మార్తాండ్ కే వెంక‌టేశ్
సినిమాటోగ్ర‌ఫీ  : విజ‌య్ సి కుమార్
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: ప‌రుచూరి ముర‌ళి
నారా రోహిత్ సినిమా అంటే కొత్త‌గా ఉంటుంద‌నే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు అది లేదు. ఈయ‌న ఈ మ‌ధ్య కాలంలో చేసిన కొన్ని సినిమాలు ఆ న‌మ్మ‌కాన్ని పోగొట్టాయి. మ‌ళ్లీ ఇప్పుడు ఆ న‌మ్మ‌కం నిల‌బెట్టుకోడానికి ఆట‌గాళ్లుతో వ‌చ్చాడు రోహిత్. మ‌రి ప్రేక్ష‌కులు ఈ సారి ఆయ‌న్ని న‌మ్మారా..?
క‌థ‌:
సిద్ధార్థ్(నారా రోహిత్) తెలుగు ఇండ‌స్ట్రీలో ఓ స్టార్ డైరెక్ట‌ర్. ఈయ‌న భార్య అంజ‌లి (ద‌ర్శిక భాన‌త్) అనుమాస్ప‌దంగా చ‌నిపోతుంది. ఆ చంపింది సిద్ధూ అని నిర్ధారిస్తాడు ఆ కేస్ వాదించిన క్రిమిన‌ల్ లాయ‌ర్ వీరేంద్ర‌(జ‌గ‌ప‌తిబాబు). కానీ ఆ త‌ర్వాత త‌ను త‌ప్పు చేసాన‌ని.. ఆ మ‌ర్డ‌ర్ చేసింది సిద్ధార్థ్ కాద‌ని తెలుసుకుంటాడు. తాను న్యాయాన్ని గెలిపించాను అనుకుంటున్న స‌మ‌యంలో కాదు ఆ మ‌ర్డర్ చేసింది సిద్ధూనే మ‌ళ్లీ ఈ లాయ‌ర్ కు అర్థం అవుతుంది. చివ‌రికి న్యాయాన్ని ఎలా గెలిపించాడు.. ఆ కేస్ లో ఇరుక్కున్న అమాయ‌కున్ని సిద్ధూ నుంచి లాయ‌ర్ ఎలా కాపాడాడు అనేది క‌థ‌.
విశ్లేష‌ణ‌:
నారా రోహిత్ సినిమాలంటే మొద‌ట్లో ప్రేక్ష‌కుల‌కు చాలా ఆస‌క్తి ఉండేది.. ఆయ‌న క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌క‌పోయినా విష‌యం ఉన్న సినిమాలు చేస్తున్నాడ‌ని. బాణం నుంచి సోలో.. అసుర‌.. రౌడీఫెల్లో.. అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు లాంటి సినిమాలు బాగా న‌చ్చాయి ప్రేక్ష‌కులకు. వాటికి డ‌బ్బులు వ‌చ్చినా రాక‌పోయినా పేరు మాత్రం వ‌చ్చింది. కానీ ఇప్పుడు ఈయ‌న సినిమాలు చూస్తుంటే ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ని అనుమానం.. అస‌లు ఒక‌ప్పుడు మ‌నం చూసిన రోహిత్ ఇత‌డేనా కాదా అని.
ఎందుకంటే ఈయ‌న్ని కూడా ఇప్పుడు క‌మ‌ర్షియ‌ల్ పురుగు కుట్టేసింది.. క‌నీసం ఒక‌ప్పుడు విజ‌యం రాక‌పోయినా.. విమ‌ర్శ‌ల నుంచి త‌ప్పించుకున్నాడు రోహిత్. కానీ ఇప్పుడు ఫ్లాపుల‌తో పాటు బోన‌స్ గా విమ‌ర్శ‌లు కూడా అందుకుంటున్నాడు. సావిత్రి.. బాల‌కృష్ణుడు అంటూ త‌ల‌తోక లేని సినిమాలు చేస్తున్నాడు.. ఇప్పుడు ఈ జాబితాలోకి ఆట‌గాళ్లు అంటూ మ‌రో సినిమా చేరిపోయింది. ఎప్పుడో మ‌రిచిపోయిన ప‌రుచూరి ముర‌ళిని మ‌ళ్ళీ గుర్తు చేసే బాధ్య‌త తీసుకున్నాడు నారా రోహిత్. రోటీన్ కారెక్ట‌ర్స్ చేసి బోర్ కొట్టిందో ఏమో కానీ.. విల‌న్ గా మెప్పించాల‌ని ట్రై చేసాడు.
కానీ క‌థ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో సీరియ‌ల్ గా సాగిపోయింది ఈ చిత్రం. వ‌చ్చే ప్ర‌తీ సీన్ ఓపిక‌కు ప‌రీక్ష పెడుతుంటే.. మ‌నం చూస్తున్న‌ది సినిమానా కాదా అనే అనుమానం కూడా వ‌స్తుంది. చిన్న పాయింట్ ప‌ట్టుకుని సినిమా అంతా న‌డిపించాడు ద‌ర్శ‌కుడు ప‌రుచూరి ముర‌ళి. ఆట‌గాళ్లు అని టైటిల్ పెట్టుకున్న‌పుడు మైండ్ గేమ్ క‌నిపించాలి.. కానీ ఈ ఆట‌గాళ్ల‌లో మాత్రం మైండ్ గేమ్ కంటే బ్లైండ్ గేమ్ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. నారా రోహిత్ త‌న కారెక్ట‌ర్ కు భిన్నంగా ఉండే పాత్ర‌లో బాగానే చేసాడు. జ‌గ‌ప‌తిబాబు అల‌వాటైన పాత్ర‌లో మెప్పించాడు..కానీ వీళ్లిద్ద‌రికి క‌థ స‌హ‌క‌రించ‌లేదు.. ద‌ర్శ‌కుడిగా ప‌రుచూరి ముర‌ళి మెప్పించ‌లేదు. ఓవ‌రాల్ గా ఈ ఆట‌గాళ్లు.. మ‌న బుర్ర‌లతో ఆడుకుంటారు..!
న‌టీన‌టులు:
నారా రోహిత్ కొత్త‌గా ఉన్నాడు. ప్ర‌తీసారి హీరోగా ట్రై చేసి ఈ సారి కొత్త‌గా విల‌న్ అయ్యాడు. జ‌గ‌ప‌తిబాబు ప‌ర్లేదు. త‌ను ఇలాంటి పాత్ర‌లు చాలానే చేసాడు. హీరోయిన్ ద‌ర్శికకు చెప్పుకోద‌గ్గ పాత్ర కాదు. ఇక క‌మెడియ‌న్ బ్ర‌హ్మి గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. సుబ్బ‌రాజ్ పోలీస్ ఆఫీస‌ర్ గా ప‌ర్లేదు. మిగిలిన వాళ్ల గురించి చెప్పాలంటే ముందు క‌థ‌లో వాళ్ల‌కు పాత్ర ఉండాలి క‌దా..!
టెక్నిక‌ల్ టీం:
సంగీత ద‌ర్శ‌కుడు సాయికార్తిక్ ఆక‌ట్టుకోలేదు. ఆయ‌న పాట‌లు కూడా బాగోలేవు. ముఖ్యంగా ఆర్ఆర్ విష‌యంలో బిగ్ బాస్ నుంచి ఎత్తేయ‌డం మ‌రీ దారుణం. సాంగ్స్ తో పాటు విజువ‌ల్ మేకింగ్ కూడా ఆక‌ట్టుకోలేదు. రెండున్న‌ర గంట‌ల సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష త‌ప్ప‌దు. పరుచూరి ముర‌ళి మ‌రోసారి దారుణంగా ఫెయిల‌య్యాడు.
చివ‌ర‌గా:
ఆట‌గాళ్లు ఆడుకున్నారు.. ఆడియ‌న్స్ తో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here