రామ్ చ‌ర‌ణ్ ఏం చేస్తున్నాడో తెలుసా..?

ఒక్క హిట్ రాగానే రామ్ చ‌ర‌ణ్ తో తెలియ‌ని జోష్ వ‌చ్చేసింది. ఈయ‌న ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. సంక్రాంతి ఎప్పుడెప్పుడు వ‌స్తుందా.. ఎప్పుడెప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేద్దామా అని చూస్తున్నాడు. ఇక షూటింగ్ విష‌యంలో కూడా చాలా ఆస‌క్తితో ఉన్నాడు మెగా వార‌సుడు. బోయ‌పాటి సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఈ చిత్ర త‌ర్వాతి షెడ్యూల్ ను యూర‌ప్ దేశాల్లో ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను.

CHARAN BOYAPATI

ఇప్పుడు ఈ సినిమా కోసం తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడు క‌నీసం క‌ల‌లో కూడా ఊహించ‌ని ప‌ని ఒక‌టి చేస్తున్నాడు బోయ‌పాటి శీను. మ‌న సినిమాలేవీ వెళ్ల‌లేని ఓ దేశానికి వెళ్లి షూటింగ్ చేసుకుని రానున్నారు బోయ‌పాటి-చ‌ర‌ణ్. ఆ దేశం పేరేంటో తెలుసా.. అజెర్బైజాన్. ఈ పేరుతో ఓ దేశం ఉంద‌ని ఎంత‌మందికి తెలుసు చెప్పండి.. కానీ ఏ గూగుల్ మ్యాప్ లో చూసాడో కానీ ఇప్పుడు అక్క‌డే నెల రోజుల షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు. రెండు పాటలు.. కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నాడు బోయ‌పాటి. నిర్మాత దాన‌య్య కూడా కావాల్సినంత బ‌డ్జెట్ పెట్ట‌డానికి సిద్ధంగా ఉన్నాడు. రంగ‌స్థ‌లం ఇచ్చిన న‌మ్మ‌కంతో 100 కోట్ల‌కు పైగానే ఈ చిత్ర బిజినెస్ చేస్తున్నారు. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్. మ‌రి ఆ దేశంలో ఎవ‌రూ చూపించ‌ని అందాల‌ను చ‌ర‌ణ్-బోయ‌పాటి ఎంతగా ప్రేక్ష‌కుల‌కు చూపిస్తారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here