రామానాయుడులో రానా అలా చేస్తున్నాడా..?

రానా అంటే కేవ‌లం హీరోగానే కాకుండా ఇంకా చాలా విధాలుగా ప్రేక్ష‌కుల‌కు తెలుసు. ఈయ‌న కేవ‌లం న‌టుడిగా కాకుండా నిర్మాత‌గా.. మేనేజ‌ర్ గా.. హోస్ట్ గా ఇలా చాలా ర‌కాలుగా ప్రేక్ష‌కుల‌కు చేరువ‌వుతున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ఇక్క‌డి హీరోయిన్ల‌ను తీసుకొచ్చి వాళ్ల‌కు అవ‌కాశం ఇచ్చేలా ఓ క్యాస్టింగ్ మేనేజ్ మెంట్ చేస్తున్నాడు రానా. దాంతోపాటు ఈ మ‌ధ్యే కేరాఫ్ కంచ‌ర‌పాలెంతో నిర్మాత‌గానూ మారాడు.

RANA DAGGUPATI NEW STUDIO

ఈ సినిమాను త‌నే ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకున్నాడు రానా ద‌గ్గుపాటి. టైటిల్స్ లో కూడా రానా పేరు క‌నిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈయ‌న మ‌రో ప‌ని చేయ‌బోతున్నాడు. ఇప్పుడు హైద‌రాబాద్ లో ఉన్న త‌మ రామానాయుడు స్టూడియోలోనే మ‌రో స్టూడియో కూడా నిర్మించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఇది కూడా సురేష్ బాబు త‌న త‌న‌యుడి కోసం చేస్తున్నాడ‌ర‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇందులో స్టూడియో అంటే సినిమాల కోసం కాదు.. కేవ‌లం ఇంట‌ర్వ్యూల కోస‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంట‌ర్వ్యూ అంటే ఛానెల్స్ కు ప‌రిగెత్త‌డం మ‌న హీరో హీరోయిన్ల‌కు అల‌వాటు. కానీ కొంద‌రు స్టార్ హీరోలు మాత్రం ఛానెల్స్ కు కాకుండా త‌మ ఆఫీసుల్లో.. ఇంట్లో.. హోటల్స్ లో ఇంట‌ర్వ్యూ ఇస్తుంటారు కానీ ఇప్పుడు రానా స్టూడియోతో ఆ క‌ష్టాలు తీరిపోనున్నాయి. ప్ర‌తీ సినిమా ఇంట‌ర్వ్యూ కూడా అక్క‌డే జ‌రిగేలా ఓ భారీ సెట్ నిర్మించ‌నున్నారు రామానాయుడులో. త‌న సినిమాల‌కు మాత్ర‌మే కాకుండా ఇండ‌స్ట్రీలో ఉన్న మిగిలిన సినిమాల‌కు కూడా ఇది ప‌నికొచ్చేలా చేస్తున్నారు. దానివ‌ల్లో మిగిలిన సినిమాల‌కు కూడా హెల్ప్ కానుంది. ఇందులో రానా హ‌స్తం ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తుంది. ఈయ‌నే ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఇప్పుడు మ‌రో స్టూడియో నిర్మాణం చేయిస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇది కూడా ఓ బిజినెస్ ట్రిక్కే. స‌క్సెస్ అయితే సినిమా వాళ్ల‌కు ఇంట‌ర్వ్యూ క‌ష్టాలు తీరిపోతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here