రానా.. క‌నీసం నీకైనా క్లారిటీ ఉందా..?

రానా ఇండ‌స్ట్రీకి ఆయ‌న స‌క్సెస్ అవుతాడా లేదా అనే అనుమానాలు చాలానే ఉండేవి. అస‌లు ఆయ‌న హీరోగా స‌క్సెస్ కాడు అని న‌మ్మిన వాళ్లే చాలా మంది ఉన్నారు. దాన్ని నిజం చేస్తూ చాలా ఏళ్ల పాటు ఒక్క విజ‌యం కూడా లేకుండానే ఇండ‌స్ట్రీలో కాలం వెల్ల‌దీసాడు ఈ వార‌సుడు. కానీ బాహుబ‌లి త‌ర్వాత రానా కెరీర్ రెక్క‌లు విప్పుకుంది. కేవ‌లం హీరోగానే కాకుండా తాను అన్ని ర‌కాల పాత్ర‌లు చేస్తానంటూ హింటిచ్చేస‌రికి రానా కోసం స్టార్ డైరెక్ట‌ర్లు కూడా వేచి చూస్తున్నారిప్పుడు.

Rana Daggubati

ఈయ‌న కెరీర్ ఇప్పుడు టాప్ స్పీడ్ లో ఉంది. రానా కోసం ఇప్పుడు తెలుగులోనే కాదు.. ఇత‌ర భాష‌ల్లోనూ ద‌ర్శ‌కులు క‌థ‌లు రాస్తున్నారు. అదేదో సినిమాలో బాల‌య్య చెప్పిన‌ట్లు న‌ర‌కడం మొద‌లు పెడితే ఏ ముక్క ఎవ‌డితో తెలుసుకోడానికి వారం ప‌డుతుంది అన్నాడు క‌దా.. ఇప్పుడు రానా కూడా ఏ భాష‌లో ఏ సినిమాలో న‌టిస్తున్నాడో తెలియ‌డానికి వారం కాదు ఏడాది ప‌ట్టేలా ఉంది. ఎందుకంటే ఆయ‌న దూకుడు కూడా అలా ఉంది మ‌రి. ఎప్పుడు ఏ సినిమా షూటింగ్ లో ఉంటాడో రానాకు కూడా క్లారిటీ లేదు. అంత బిజీగా ఉన్నాడు ఈయ‌న‌.

దానికితోడు ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో చంద్ర‌బాబు పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ పూర్తైన త‌ర్వాత కానీ బ‌య‌టికి వెళ్లేలా క‌నిపించ‌డం లేదు ఈయ‌న‌. దానికితోడు తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాలంలో తెర‌కెక్కుతున్న రెండూ మూడు సినిమాలు చేస్తున్నాడు రానా. మొత్తానికి వ‌చ్చే ఏడాది నాటికి రానా కెరీర్ మ‌రింత హై లెవ‌ల్ కు చేర‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. తెలుగులో ఏ హీరోకు సాధ్యం కాని రీతిలో ఈయ‌న అన్ని ఇండ‌స్ట్రీల్లోనే తెలుగు జెండా ఎగ‌రేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here