మ‌రో బాంబ్ పేల్చిన పూజాహెగ్డే..

ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. లేక‌పోతే మ‌రేంటి.. అస‌లే చ‌లి గిలి పుడుతుంటే ఈ మ‌ధ్య హాట్ ఫోటోషూట్ల‌తో రెచ్చిపోతుంది పూజా హెగ్డే. ప్ర‌స్తుతం ఈమె తెలుగు ఇండ‌స్ట్రీని కుమ్మేస్తుంది. ఒక్క హిట్ కూడా లేకుండానే ఫ్యూచ‌ర్ నెంబ‌ర్ వ‌న్ అయ్యేలా క‌నిపిస్తుంది. ఈమె న‌టించిన ముకుందా.. ఒక లైలా కోసం.. డిజే.. సాక్ష్యం.. ఏదీ హిట్ కాదు.

pooja-hedge

కానీ పూజా మాత్రం తెలుగులో ఇప్పుడు స్టార్ హీరోయిన్. దానికి కార‌ణం ఆమె అందాల ఆర‌బోత‌. డిజే యావ‌రేజ్ గా ఆడినా.. ఆమె అందాల ఆర‌బోత మాత్రం సూప‌ర్ హిట్టైంది. ఇది చాల‌ద‌న్న‌ట్లు ఏ సినిమా ప్ర‌మోష‌న్స్ కు.. బ‌య‌ట జ‌రిగే ఫంక్ష‌న్ ల‌కు పూజాహెగ్డే త‌న గ్లామ‌ర్ షోతో ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది.

ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇప్పుడు త‌నే సొంత డ‌బ్బింగ్ కూడా మొద‌లు పెట్టింది ఈ భామ‌. ఇది పూజా హెగ్డేకు ఇంకా బాగా హెల్ప్ కానుంది. అందం ప్ల‌స్ అభిన‌యంతో పాటు సొంతంగా చిల‌క ప‌లుకులు కూడా ప‌లికితే పూజాకు ఇంక అడ్డు చెప్పేవాళ్లు కూడా ఉండ‌రు. ఆమెదే ఆడింది ఆట‌.. పాడింది పాట అవుతుంది. ఓ వైపు సినిమాలు.. మ‌రోవైపు హాట్ ఫోటో షూట్ లు ఊపిరి తీసుకోనంత అందాలు.. ఇంకోవైపు తెలుగు డ‌బ్బింగ్.. ఇలా అన్నింటితో ర‌ప్ఫాడిస్తుంది పూజా. ప్ర‌స్తుతం తెలుగులో మ‌హేశ్ మ‌హ‌ర్షి.. ఎన్టీఆర్ అర‌వింద స‌మేత‌.. ప్ర‌భాస్ రాధాకృష్ణ‌ సినిమాల్లో హీరోయిన్ గా క‌న్ఫ‌ర్మ్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *