మ‌ణిర‌త్నం.. నవాబ్ ఆఫ్ డైరెక్ట‌ర్స్..!

ఇండియాలో ఉన్న ద‌ర్శ‌కుల్లో మ‌ణిర‌త్నం లెజెండ్. హిట్లు ఫ్లాపులు లాంటి చిన్న విష‌యాల‌ను ఆయ‌న ఎప్పుడో దాటిపోయాడు. మ‌ణిర‌త్నం సినిమా అంటే అదో అద్భుతం అంతే. ఇప్ప‌టికీ ఆయ‌న సినిమా ఎలా ఉన్నా చూసే ప్రేక్ష‌కులు ఉన్నారు. హీరోలు కూడా మ‌ణితో ఒక్క‌సారి వ‌ర్క్ చేయాల‌ని ఆరాట‌ప‌డుతుంటారు. అది ఆయ‌న ప్ర‌త్యేక‌థ‌. ఇప్పుడు కూడా చెలియా లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత ఊహ‌కంద‌ని కాంబినేష‌న్ సెట్ చేసుకు న్నాడు మ‌ణిర‌త్నం.

NAWAB TRAILER

ద‌క్షిణాదిన ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు వ‌చ్చుండొచ్చు కానీ ఇప్పుడు కొత్త ప్ర‌యోగంతో వ‌స్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇది కేవలం మ‌ణిర‌త్నంకు మాత్ర‌మే సాధ్య‌మైన సినిమా. ఆయ‌న త‌ప్ప మ‌రెవ‌రూ హ్యాండిల్ చేయ‌లేని సినిమా. అదే న‌వాబ్. ఇప్పుడు ఈ చిత్ర ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత మ‌ణిర‌త్నంను ఎందుకు ఇంత‌గా ఆరాధిస్తారో మ‌రోసారి అర్థమైపోయింది.
ఒకే సినిమాలో ఐదుగురు స్టార్స్ ను క‌లిపి న‌టిస్తున్నారు.

విజ‌య్ సేతుప‌తి.. అర‌వింద్ స్వామి.. జ్యోతిక‌.. అరుణ్ విజ‌య్.. ఐశ్వ‌ర్యా రాజేష్.. శింబు లాంటి స్టార్స్ ఉన్నారు. ఈ చిత్రంలో జ‌య‌సుధ‌, ప్ర‌కాశ్ రాజ్ మ‌రోసారి జంట‌గా న‌టిస్తున్నారు. ఇక వాళ్ల కొడుకులుగా శింబు, అర‌వింద్ స్వామి, అరుణ్ విజ‌య్ న‌టిస్తుండ‌గా.. పోలీస్ ఇన్స్ పెక్ట‌ర్ గా విజ‌య్ సేతుప‌తి క‌నిపిస్తున్నాడు. జ్యోతిక‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లు. ట్రైల‌ర్ లో మేకింగ్ చూసి మెంట‌ల్ ఎక్కుతుంది ఒక్కొక్క‌రికి. మొత్తానికి చెలియా లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత మ‌ణిర‌త్నం ఇలా భారీ మ‌ల్టీస్టార‌ర్ తో వ‌స్తుండ‌టం అత‌డి అభిమానుల‌కు పండ‌గే. అయినా ఇలాంటి మ్యాజిక్కులు చేయాలన్నా.. ఇంత‌టి స్టార్ క్యాస్ట్ హ్యాండిల్ చేయాల‌న్నా అది ఒక్క మ‌ణిర‌త్నంకు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here