మ‌గ‌ధీర‌.. ప‌దేళ్లైనా ప‌వ‌ర్ త‌గ్గ‌లేదు..

గ‌బ్బ‌ర్ సింగ్ లో డైలాగ్ ఇంకా గుర్తుంది క‌దా.. ప‌దేళ్లైనా పాట ప‌వ‌ర్ త‌గ్గ‌లేదంటూ అందులో ఏ మేరా జ‌హా గురించి చెప్తాడు అలీ. ఇప్పుడు మ‌గ‌ధీర గురించి కూడా ఇలాగే చెప్పాల్సి వ‌స్తుంది. ఈ సినిమా కూడా ఇప్ప‌టికీ దున్నేస్తుంది. వ‌చ్చి పదేళ్లు అయినా కూడా మ‌గ‌ధీర అద్భుతాలు జ‌రుగుతున్నాయి.

MAGADHEERA IN JAPAN

జ‌పాన్ లో ఈ చిత్రం ఇప్పుడు సంచ‌ల‌న విజ‌యం దిశ‌గా అడుగు వేస్తుంది. ఇప్ప‌టికే అక్క‌డ ఇండియ‌న్ సినిమాల్లో అత్య‌ధికంగా వ‌సూలు చేసిన జాబితాల సినిమాల లిస్ట్ లో రెండో స్థానం అందుకుంది. ముత్తు 4 మిలియ‌న్ కు పైగా వ‌సూలు చేస్తే.. ఇప్పుడు మ‌గ‌ధీర 2 మిలియ‌న్ కంటే ఎక్కువ‌గా క‌లెక్ట్ చేసి స‌త్తా చూపించింది. ఈ విష‌యంలో బాహుబ‌లిని కూడా బీట్ చేసింది ఈ సినిమా. ఇప్ప‌టికీ వ‌సూళ్లు కురిపిస్తూనే ఉంది.

ఈ సినిమాలోని ప్రేమ‌క‌థ జ‌ప‌నీయుల‌కు బాగానే క‌నెక్ట్ అయింది. అయినా ఇది ప‌దేళ్ల కింది సినిమా అని మ‌న‌కు తెలుసు కానీ పాపం వాళ్ల‌కు తెలియ‌దు క‌దా.. అందుకే కొత్త సినిమా అనుకుని పండ‌గ చేసుకుంటున్నారు. రాజ‌మౌళికి బాహుబ‌లి పుణ్య‌మా అని జ‌పాన్ లో కూడా కాస్తోకూస్తో పేరొచ్చింది. దాంతో ఇప్పుడు ఇదే దూకుడు మ‌గ‌ధీర‌కు క‌లిసొచ్చింది. కంటెంట్ బాగుంటే ఎన్నేళ్లైనా.. ఎన్నాళ్లైనా సంచ‌ల‌నం త‌ప్ప‌ద‌ని మ‌గ‌ధీర మ‌రోసారి ప్రూవ్ చేసింద‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here