మంచు మ‌నోజ్.. ది రియ‌ల్ హీరో..!

ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. స్నేహానికి అర్థం తెలిసిన వాళ్లే దీనికి స‌రిగ్గా స‌రిపోతారు. ఇప్పుడు మ‌నోజ్ కుమార్ ఇదే చేసి చూపించాడు. సినిమాల్లో కాక‌పోయినా బ‌య‌ట మాత్రం సూప‌ర్ స్టార్ అయిపోయాడు మంచో మ‌నోజ్ కుమార్. ఈయ‌న కొన్ని రోజులుగా సినిమాల‌కు దూరంగా ఉన్నారు.. అస‌లు బ‌య‌ట క‌నిపించ‌డ‌మే మానేసారు.. కానీ ఇప్పుడు ఈయ‌న సోష‌ల్ మీడియాలో కింగ్ అయిపోయాడు.

Manchu Manoj Attend Hari krishna Funeral

ఈయ‌న‌కు ఇప్పుడు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు.. అది ఆయ‌న చేసిన ప‌ని వ‌ల్లే. హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత మంచు ఫ్యామిలీ అక్క‌డ ఎవ‌రూ క‌నిపించ‌లేదు. మోహ‌న్ బాబు విదేశాల్లో ఉండ‌టం.. మ‌నోజ్ కూడా టూర్ లో ఉండ‌టంతో ఎవ‌రూ క‌నిపించ‌లేదు. అయితే విష‌యం తెలిసి వెంట‌నే వ‌చ్చిన మ‌నోజ్.. ఎన్టీఆర్ కు తోడుగా ఉన్నాడు. హ‌రికృష్ణ అంతిమ‌యాత్ర‌లో కూడా సాధార‌ణ ప్రేక్ష‌కుడిగా జూనియ‌ర్ ముందు న‌డిచారు. బాడీగార్డ్ లా మారిపోయి.. ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ వైపు ఎవ‌రూ రాకుండా చూసుకున్నాడు మ‌నోజ్. ఈయ‌న తీరు చూసి అక్క‌డున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు. హీరో అయ్యుండి.. మంచు వార‌సుడు అయ్యుండి అంత సింపుల్ గా ఎలా ఉన్నాడో అంటూ మ‌నోజ్ ను పొగుడుతున్నారు. మొత్తానికి సినిమాలు కాక‌పోయినా బ‌య‌ట మాత్రం మ‌నోజ్ రియ‌ల్ స్టార్ అయిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here