బిగ్ బాస్ తో పూజ‌కు రుణం తీరిపోయిందా..?

వారం వారం ఆసక్తి పెంచేస్తుంది బిగ్ బాస్. ఈ వారం అయితే మరింత ఆసక్తిగా వేచి చూస్తున్నారు ప్రేక్షకులు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇన్ని వారాలు ఆదివారం వస్తే ఎవరు బయటికి వెళ్లిపోతారా అని ఆస‌క్తిగా చూస్తున్నారు. షో రేటింగ్ పెంచ‌డానికి తమ చేతిలో ఉన్న అన్ని అస్త్రాలను వాడేస్తున్నారు.

Bigg Boss 2 Telugu Contestant Pooja Ramachandran Stills

ఇక ఈ వారం కూడా ఎవ‌రు బ‌య‌టికి వ‌స్తారు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం చూస్తుంటే ఈ వారం బ‌య‌టికి వ‌చ్చేది మ‌రో అనుమానం లేకుండా పూజా రామ‌చంద్ర‌న్ అని తెలుస్తుంది. లీక్ వీరులు ఇచ్చిన స‌మాచారం ఇది. మ‌ధ్య‌లో వ‌చ్చింది క‌దా.. అందుకే మ‌ధ్య‌లోనే పంపించాల‌ని చూస్తున్నారు. ఇదే ఇప్పుడు పూజాకు మైన‌స్ గా కూడా మారింది.

ఇంట్లో ముందు నుంచి ఉన్నారు కాబ‌ట్టే ఇప్పుడు పూజా మిగిలిన ముగ్గురు అయిన తనీష్, కౌశ‌ల్, దీప్తిల‌తో పోటీ ప‌డ‌లేక‌పోతుంది. దీప్తి, పూజా మ‌ధ్య వార్ న‌డుస్తున్నా.. ఈ వారం దీప్తి కెప్టెన్. దాంతో ఎటు చూసుకున్నా కూడా పూజాకు ఈ వారంతో బిగ్ బాస్ రుణం తీరిపోయిన‌ట్లే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here