బాబీ సినిమాకు మ‌ళ్లీ ఏమైంది..?

చేసింది మూడు సినిమాలే.. కానీ మూడు స్టార్ హీరోల‌తోనే చేసాడు. అందులో రెండు సినిమాలు బాగానే ఆడాయి కూడా. ఆ ద‌ర్శ‌కుడే బాబీ ఉర‌ఫ్ కేఎస్ ర‌వీంద్ర‌. జై ల‌వ‌కుశ త‌ర్వాత ఈయ‌న క‌నిపించ‌డ‌మే మానేసాడు. వ‌చ్చిన స‌క్సెస్ ను కూడా క్యాష్ చేసుకోలేని అమాయ‌కుడు పాపం ఈ ద‌ర్శ‌కుడు. ఎన్టీఆర్ లాంటి హీరోతో మూడు పాత్ర‌లు చేయించి ఔరా అనిపించాడు బాబీ. జై ల‌వ‌కుశ‌ త‌ర్వాత బాబీ కోసం స్టార్ హీరోలంతా క్యూ క‌డ‌తారేమో అనుకున్నారంతా.

BOBBY

కానీ అలాంటిదేం జ‌ర‌గ‌లేదు. ఇప్ప‌టికీ మ‌రో సినిమా సెట్ చేసుకోలేక‌పోయాడు ఈ ద‌ర్శ‌కుడు. ఏదో ఒక‌టి చేసి ఆ మ‌ధ్య జులై 11న వెంక‌టేశ్, నాగ‌చైత‌న్య హీరోలుగా వెంకీ మామ సినిమాకు ముహూర్తం పెట్టాడు బాబీ. రామానాయుడు స్టూడియోస్ లోనే ఈ చిత్ర ముహూర్తం జ‌ర‌గ‌నుంది. సురేష్ బాబుతో క‌లిసి పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతూకు జోడీగా ర‌కుల్.. వెంక‌టేశ్ కు జోడీగా హ్యూమాఖురేషి న‌టించ‌బోతున్నారు.

అయితే ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టాలెక్క‌లేదు. క‌నీసం షూటింగ్ ఎప్పుడో కూడా చెప్ప‌డం లేదు బాబీ. దాంతో ఈ కుర్ర ద‌ర్శ‌కుడి కెరీర్ ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కావ‌డం లేదు. పైగా ఈ ద‌ర్శ‌కుడి టాలెంట్ ను కొంద‌రు దోచేస్తున్నార‌నే టాక్ కూడా ఇండ‌స్ట్రీలో వినిపిస్తుంది. కోన‌వెంకట్ లాంటి స్క్రీన్ ప్లే రైట‌ర్స్ బాబీని ఔట్ ఫోక‌స్ చేస్తున్నార‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. జై ల‌వ‌కుశ టైమ్ లో ద‌ర్శ‌కుడు బాబీ కంటే అన్నిచోట్లా కోన‌వెంక‌టే క‌నిపించాడు. బాబీకి స‌క్సెస్ కొట్ట‌డం తెలిసినా.. దాన్ని క్యాష్ చేసుకునే ప‌ద్ద‌తి ఇంకా అబ్బ‌లేదంటారు ఇండ‌స్ట్రీలో కొంద‌రు. అందుకే జై ల‌వ‌కుశ లాంటి సినిమా త‌ర్వాత కూడా ఏడాది పాటు మ‌రో సినిమా కోసం ఆగాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రి ఇప్పుడు ఈ మ‌ల్టీస్టార‌ర్ తో అయినా బాబీ మ‌ళ్లీ గాడిన ప‌డ‌తాడో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here