బాబాయ్ తో సినిమా చేస్తోన్న స‌మంత‌..

స‌మంత‌కు ఇదివ‌ర‌కు అంటే ఎవ‌రూ లేరు.. కానీ ఇప్పుడు పెద్ద కుటుంబమే ఉంది. ఈమె వెంటే అక్కినేని.. ద‌గ్గుపాటి ఫ్యామిలీస్ ఉన్నాయి. పైగా ఇప్ప‌టికీ స‌మంత హీరోయిన్ గానే సాగుతుంది కాబ‌ట్టి ఆమెతో సినిమాలు చేయ‌డానికి బ‌య‌టి నిర్మాత‌లు కూడా అవ‌స‌రం లేదు. ఇంట్లో వాళ్లే స్యామ్ తో సినిమాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ధ‌మైన యు ట‌ర్న్ సినిమా కోసం రెమ్యున‌రేష‌న్ కాకుండా వాటా తీసుకుంది ఈ భామ‌. ఇక ఇప్పుడు ఏకంగా బాబాయ్ తోనే సినిమా చేయ‌బోతుంది స‌మంత‌. అంటే సురేష్ బాబుతో అన్న‌మాట‌.

Samantha Movie With Suresh Babu

పెళ్లైన త‌ర్వాత హీరోయిన్ల కెరీర్ కు ఎండ్ కార్డ్ ప‌డుతుందంటారు. కానీ స‌మంత‌కు మాత్రం పెళ్లి త‌ర్వాతే సుడి ఇంకా క‌లిసొస్తుంది. అస‌లు ఈమె పెళ్ళైన త‌ర్వాత ఎన్ని సినిమాలు చేసింది.. ఎన్ని విజ‌యాలు సాధించింది అని లెక్కేస్తే.. 100 శాతం స‌క్సెస్ రేట్ తో దూసుకెళ్లిపోతుంది. రంగ‌స్థ‌లం.. మ‌హాన‌టి.. అభిమ‌న్యుడుతో హ్యాట్రిక్ బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుంది.
మ‌రీ పెళ్లికి ముందులా గ్లామ‌ర్ షో కాకుండా సింపుల్ గా ఫీమేల్ ఓరియెంటెడ్ క‌థ‌ల‌పైనే దృష్టి పెడుతుంది. ప్ర‌స్తుతం విజ‌య్ సేతుప‌తితో సూప‌ర్ డీల‌క్స్ షూటింగ్ పూర్తి చేసింది స్యామ్.

దాంతో పాటు తెలుగులో యు ట‌ర్న్ సినిమా కూడా పూర్తి చేసింది. రెండు సినిమాల‌తో పాటు శివ‌కార్తికేయన్ సీమ‌రాజా సినిమాను సైతం పూర్తి చేసింది. యు ట‌ర్న్ తో పాటు సీమ‌రాజా కూడా సెప్టెంబ‌ర్ 13నే విడుద‌ల కానున్నాయి. తెలుగులో భ‌ర్త నాగ చైత‌న్య‌తో శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా క‌మిటైంది. ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే ఇప్పుడు నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నుంది స‌మంత‌. ఇందులో 70 ఏళ్ల బామ్మ‌గా న‌టించ‌నుంది. కొన్ని అతీత శ‌క్తులున్న బామ్మ కాస్తా 25 ఏళ్ల భామ‌గా ఎలా మారింద‌నేది క‌థ‌. కొరియ‌న్ డ్రామా మిస్ గ్రానీకి ఇది రీమేక్. ఇప్ప‌టికే క‌థ కూడా పూర్తి చేసింది నందినిరెడ్డి. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రానుంది. మొత్తానికి స్యామ్ దూకుడు చూస్తుంటే ఇప్ప‌ట్లో సినిమాలు మానేయ‌డం క‌ష్ట‌మే అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here