ప‌వ‌న్ పై ఇంత ప్రేమ పెరిగిపోయిందేంటి..?

మెగా కుటుంబంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఎప్ప‌ట్నుంచో ప్రేమ ఉంది. దాని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కాక‌పోతే ఈయ‌నపై ఉన్న ప్రేమ లోప‌లే దాగి ఉంటుంద‌న్న‌మాట‌. కానీ ఇప్పుడు ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అంద‌రికీ ఒకేసారి ఆ ప్రేమ బ‌య‌టికి వ‌చ్చింది.

చిరంజీవి.. రామ్ చ‌ర‌ణ్ ల‌కు అయితే అది మ‌రింత ఎక్కువ‌గా వ‌చ్చింది. రామ్ చ‌ర‌ణ్ ఏకంగా పారాచూట్ క‌ట్టుకుని గాల్లో ఎగురుతూ మ‌రి బాబాయ్ కు బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు. ఇక చిరు కూడా ప్ర‌త్యేకంగా త‌మ్ముడికి బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో గిఫ్ట్ కూడా ఇచ్చాడు రామ్ చ‌ర‌ణ్. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీలో ప్ర‌త్యేకంగా ప‌వ‌న్ విజువ‌ల్స్ పై ఓ వీడియో క‌ట్ చేసి పెట్టారు.

అంతా జ‌న‌సేన ఫోటోస్ పైనే ఉండ‌టంతో త్వ‌ర‌లోనే క‌చ్చితంగా అంతా క‌లిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ప్ర‌చారం చేస్తారేమో అనిపిస్తుంది. ప‌వ‌న్ వ‌ద్దంటున్నా కూడా త‌మ్ముడికి తోడు చిరు.. బాబాయ్ కు తోడుగా అబ్బాయిలు ప్ర‌చారానికి వ‌చ్చేలా ఉన్నారు. ఇళ్లేమో దూరం అంటూ ప‌వ‌న్ ఆవేశంగా మాట్లాడిన మాట‌ల‌ను ఇప్పుడు కొణిదెల వారు బాగానే వాడుకున్నారు. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో క‌చ్చితంగా జ‌న‌సేనకు అంతా క‌లిసి క‌ట్టుగా తోడుండేలా క‌నిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here