ప‌ద్ద‌తిగా చంపేస్తున్న గీత‌..

సంప్ర‌దాయ‌ని శుద్ధపాడ్య‌మి.. ప్రేమ‌శ్రావ‌ణి శ‌ర్వాని.. అంటూ గీత‌గోవిందంలో ఓ పాట ఉంది. ఇది ర‌ష్మిక మంద‌న్న‌ను ఊహించుకుని క‌వి రాసిన పాట. దీన్నిప్పుడు నిజం చేసి చూపించింది ఈ భామ‌. శ్రావ‌ణ‌మాసం.. పైగా శుక్ర‌వారం.. దాంతో హీరోయిన్ అయినా కూడా త‌ను కూడా అమ్మాయే క‌దా.. అందుకే ప‌ద్ద‌తిగా చీర క‌ట్టుకుని గుడికి వెళ్లి అక్క‌డ కావాల్సిన పూజ‌లు చేసింది ర‌ష్మిక మంద‌న్న‌.

RASHMIKA MANDANN

ఇప్పుడు ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ భామ చాప‌కింద నీరులా ఇండ‌స్ట్రీని ఆక్ర‌మిస్తుంది. ఛ‌లో చూసిన‌పుడు అదృష్టమేమో అనుకున్నారు కానీ గీత గోవిందం చూసిన త‌ర్వాత మాత్రం అమ్మాయి టాలెంటెడ్ అని ఫిక్సైపోయారంతా. విజ‌య్ దేర‌వ‌కొండ లాంటి న‌టున్ని కూడా కొన్నిచోట్ల న‌ట‌న‌తో డామినేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే చంపేసింది ర‌ష్మిక‌.

ఇప్పుడు ఈ భామ కోసం స్టార్ హీరోలు కూడా చూస్తున్నారు. అస‌లు ఎవ‌రీ ముద్దుగుమ్మ‌.. ఎక్క‌డ్నుంచి వ‌చ్చింది.. ఇలా ఎలా చంపేస్తుంది అనుకుంటూ ఆరా తీస్తున్నారు. క‌న్న‌డ‌లో గ‌తేడాది కిరిక్ పార్టీ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది ర‌ష్మిక‌. ఈ చిత్రం అక్క‌డ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. పైగా అమ్మాయిగారికి అందాల ఆర‌బోత‌లో పెద్ద‌గా అభ్యంత‌రాలు కూడా లేక‌పోవ‌డంతో అమ్మ‌డు స్టార్ అయిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం నానితో దేవ‌దాసు.. విజ‌య్ తోనే డియ‌ర్ కామ్రేడ్ సినిమాలు చేస్తుంది ఈ భామ‌. వ‌ర‌స సినిమాల‌తో తెలుగులోకి చాలా సైలెంట్ గా వ‌చ్చేసింది ఈ కిర్రాక్ హీరోయిన్. దానికితోడు మ‌రో రెండు సినిమాల్లోనూ ర‌ష్మిక‌ను హీరోయిన్ గా ప‌రిశీలిస్తున్నారు. మ‌రి టాలీవుడ్ లో ర‌ష్మిక‌ మాయ ఎంత‌వ‌ర‌కు కొన‌సాగుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here