ప్ర‌భాస్ దానికి ముహూర్తం పెట్టేసాడు..!

దేనికి.. దానికి అంటే దేనికి..? ఇప్పుడు ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు అంద‌రికీ వ‌స్తున్న అనుమానం కూడా ఇదే క‌దా. దానికి అంటే ఇక్క‌డ బూతేం లేదండీ బాబూ.. ఆయ‌న ప్రేమ‌కు అని అర్థం. అవును.. ఇప్పుడు ప్ర‌భాస్ ప్రేమ‌లో ప‌డ్డాడు. కొన్నేళ్లుగా క‌త్తులు క‌టార్లు త‌ప్ప పూలు ప‌ళ్ళు చూడ్డం లేదు ప్ర‌భాస్. అందుకే అన్నీ మానేసి హాయిగా అమ్మాయిల వెంట తిర‌గాల‌ని ఫిక్సైపోయాడు ఈ హీరో.

PRABHAS

అందుకే త‌ర్వాతి సినిమాను పూర్తిగా ప్రేమ‌క‌థ చేస్తున్నాడు ప్ర‌భాస్. ప్ర‌స్తుతం ఈయ‌న‌ సాహోతో బిజీగా ఉన్నాడు. ఇది సెట్స్ పై ఉండ‌గానే రాధాకృష్ణ కుమార్ సినిమాకు కూడా ఓకే చెప్పాడు. ఈ సినిమాకు సెప్టెంబ‌ర్ 6న ముహూర్తం పెట్ట‌నున్నార‌ని తెలుస్తుంది. అక్టోబ‌ర్ చివ‌ర్లో ప‌ట్టాలెక్క‌నుంది. క‌థ అంతా యూర‌ప్ చుట్టూనే తిర‌నుంది. అక్క‌డే భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు రాధా. అయితే నెల‌ల త‌ర‌బ‌డి అక్క‌డే షూటింగ్ చేయాల్సి రావ‌డంతో మ‌నం అక్క‌డికి వెళ్లేకంటే.. ఆ దేశాన్నే ఇక్క‌డికి తీసుకొస్తే బాగుంటుంది క‌దా అని ఆలోచిస్తున్నాడు ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్.

భారీ సెట్ ఒక‌టి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు రాధా. చాలా వ‌ర‌కు యూర‌ప్ లో షూట్ చేసి.. మిగిలిన ప్యాచ్ వ‌ర్క్ ఇక్క‌డ సెట్ లో కానివ్వాల‌ని ద‌ర్శ‌కుడి ప్లాన్. ఈ చిత్ర ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప్ర‌స్తుతం వేగంగా జ‌రుగుతుంది. సాహో సెట్స్ పై ఉండ‌గానే రాధాకృష్ణ సినిమాను కూడా పూర్తి చేయాల‌నేది ఈయ‌న ప్లాన్.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 2019లో రెండు సినిమాలతో రావాల‌ని చూస్తున్నాడు ప్ర‌భాస్. ప్ర‌తీ చిన్న విష‌యానికి యూర‌ప్ అంటే కుద‌ర‌దు. అందుకే ఆ దేశ‌పు సెట్ ను హైద‌రాబాద్ లో వేయాల‌ని చూస్తున్నారు. యూర‌ప్ ను త‌ల‌పించేలా భారీ సెట్టింగులు.. రోడ్లు.. క‌ట్ట‌డాలు ఇక్క‌డే వే్స‌తున్నారు. 6 కోట్ల‌కు పైగా భారీ ఖ‌ర్చుతో ఈ సెట్ నిర్మాణం జ‌ర‌గ‌నుంది. దీనికోసం హాలీవుడ్ నిపుణులు కూడా ప‌ని చేయ‌బోతున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టించ‌బోతుంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ జాత‌కాలు చెప్పేవాడి పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. 70-80వ ద‌శ‌కంలో ఈ క‌థ న‌డ‌వ‌నుంది. మొత్తానికి చూడాలిక‌.. ప్ర‌భాస్ జాత‌కం ఈ సినిమాతో ఎలా మార‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here