ప్రియ‌ద‌ర్శికి పోటీగా వ‌స్తున్న రాహుల్..

తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల‌కు క‌రువు వ‌స్తుందేమో కానీ క‌మెడియ‌న్లకు మాత్రం కాదు. ఎప్పుడూ పాతిక మంది క‌మెడియ‌న్లు ప్రేక్ష‌కుల కోసం న‌వ్వించ‌డానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు కూడా ఓ కుర్ర క‌మెడియ‌న్ స‌త్తా చూపిస్తున్నాడు. అత‌డి పేరు రాహుల్ రామ‌కృష్ణ‌. పేరు చెబితే గుర్తు ప‌ట్ట‌డం క‌ష్టం కానీ అర్జున్ రెడ్డిలో హీరోతో పాటు ఫ్రెండ్ ఉంటాడు క‌దా.. అత‌డే రాహుల్.

rahul ramakrishna and priyadarshini

ఇప్పుడు గీత‌గోవిందంలో కూడా విజ‌య్ స్నేహితుడిగా న‌టించాడు. ఈయ‌న షార్ట్ ఫిల్మ్ బ్యాగ్రౌండ్ నుంచి వ‌చ్చాడు. త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన సైన్మాలో ఈయ‌నే హీరో. ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. ఇప్పుడు క్రేజీ క‌మెడియ‌న్ అయిపోయాడు రాహుల్.

స్వ‌యంగా చిరంజీవి సైతం రాహుల్ కామెడీని మెచ్చుకున్నాడు. చూస్తుంటే ప్రియ‌ద‌ర్శికే ఈ క‌మెడియ‌న్ పోటీగా వ‌చ్చేలా క‌నిపిస్తున్నాడు. ఇప్పుడు ప్రియద‌ర్శి సూప‌ర్ ఫామ్ లో ఉన్నాడు. వ‌ర‌స సినిమాల‌తో దున్నేస్తున్నాడు. మ‌రోవైపు రాహుల్ కూడా వ‌ర‌స సినిమాలు అందుకుంటున్నాడు.

తెలంగాణ యాసెంట్ చ‌క్క‌గా మాట్లాడ‌టం మ‌నోడికి ప్ల‌స్. అందుకే తెలంగానే నేఫ‌థ్య‌మున్న సినిమాల్లో రాహుల్ ను తీసుకుంటున్నారు. ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న క‌ల్కిలో కూడా రాహుల్ ను తీసుకున్నారు. ఇది 1983 నాటి తెలంగాణ క‌థ. అందుకే ఇందులో రాహుల్ ను తీసుకున్నాడు ప్రశాంత్. మొత్తానికి ఈయన‌ దూకుడు చూస్తుంటే ప్రియ‌ద‌ర్శితో పాటు ఇంకా చాలా మందికి టెండ‌ర్ పెట్టేలా క‌నిపిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here