పిచ్చెక్కిస్తున్న‌ మ‌హేశ్ వీడియో సాంగ్..

మ‌హేశ్ వీడియో సాంగ్ ఏంటి..? ఎక్క‌డి నుంచి వ‌చ్చింది ఈ పాట‌.. ఇప్పుడు ఎలా వ‌చ్చింది అనుకుంటున్నారా..? అలాగే వ‌చ్చింది.. మ‌హేశ్ కొత్త పాట ఇప్పుడు యూ ట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈయ‌న న‌టిస్తున్న మ‌హర్షి షూటింగ్ స‌గం కూడా పూర్తి కాలేదు కదా అప్పుడే ఎలా వ‌చ్చింది పాట‌..

కొంప‌దీసి లీక్ అయిందా ఏంటి అనుకుంటున్నారా..? అలాంటిదేం జ‌ర‌గ‌లేదు.. ఎలాంటి లీక్ రాలేదు కానీ మ‌హేశ్ పాట మాత్రం బ‌య‌టికి వ‌చ్చేసింది. ఈ మ‌ధ్య యాడ్స్ ను సినిమా కంటే గ్రాండ్ గా తెర‌కెక్కిస్తున్నారు మేక‌ర్స్.
ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. మ‌హేశ్ ఎలాగూ యాడ్స్ లోనూ సూప‌ర్ స్టార్ క‌దా.. అందుకే క్లోజ్ అప్ యాడ్ బాలీవుడ్ రేంజ్ లో చేసారు. ఇప్పుడు ఈ పాట విడుద‌లైంది. అది కూడా వీడియో సాంగ్. ఈ పాట చూస్తుంటే ఏ కోణంలోనూ యాడ్ లా క‌నిపించ‌డం లేదు. అంత రిచ్ గా తెర‌కెక్కించారు. రెండు నిమిషాలున్న ఈ పాట ఇప్పుడు మ‌హేశ్ ఫ్యాన్స్ ను ఉర్రూత‌లూగిస్తుంది. మ‌హేశ్ ఎప్ప‌ట్లాగే కొత్త లుక్ లో కేక పుట్టిస్తున్నాడు. ఈ పాట కోసం ఇప్పుడు క్లోజ్ అప్ కు వెళ్లిపోయేలా ఉన్నారు అభిమానులు. ఎంతైనా మ‌హేశ్ ను యాడ్స్ లో కొట్టేవాళ్లు లేరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here