నిధి అగ‌ర్వాల్ కు అప్పుడే ఫిల్మ్ ఫేర్..!

నిధి అగ‌ర్వాల్ అంటే ఆ హీరోయినే క‌దా.. ఎప్పుడు చూడూ అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంటుంది..? ఆమెకు ఫిల్మ్ ఫేర్ రావ‌డం ఏంటి ఎప్పుడూ అందాలు ఆర‌బోస్తూనే ఉంటుంది క‌దా.. అస‌లు న‌ట‌న ఎప్పుడు చూపించింది.. చూపించివ‌న్నీ అందాలే క‌దా ఎందుకు ఫిల్మ్ ఫేర్ అనే క‌దా డౌట్..! నిజ‌మే అందుకే వాళ్లు కూడా ఈమెకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఇవ్వ‌లేదు. త‌న‌కు అల‌వాటైన ప‌ద్ద‌తిలో మ‌రోసారి అందాల‌ను ఆర‌బోయ‌మ‌న్నారు. ఫిల్మ్ ఫేర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై రెచ్చిపోయింది నిధి. త‌న అందాల నిధిని తీసుకొచ్చి అక్క‌డ గుమ్మ‌రించింది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో స‌వ్య‌సాచి.. అఖిల్ మూడో సినిమాలో న‌టిస్తుంది ఈ భామ‌.

NIDHI-AGARWAL-FILMFARE
ఇది వ‌ర‌కే బాలీవుడ్ లో మున్నామైఖెల్ లో టైగ‌ర్ ష్రాఫ్ తో జోడీక‌ట్టింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌స్తూ వ‌స్తూనే త‌న టాలెంట్ అంతా చూపిస్తుంది. అందాల నిధి తాళం ఓపెన్ చేసి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తుంది. సినిమాల్లోనూ దీనికి ఏ మాత్రం త‌గ్గ‌కుండానే ఎక్స్ పోజింగ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. రోజుకో విధంగా హాట్ గా ద‌ర్శ‌నం ఇస్తూ సోష‌ల్ మీడియానే వేడెక్కిస్తుంది ఈ బ్యూటీ. ఈమె దూకుడు చూసి ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ప‌రేషాన్ అవుతున్నారు. స‌వ్య‌సాచి విడుద‌ల‌కు ముందే అఖిల్ మూడో సినిమాలో ఆఫ‌ర్ అందుకుంది నిధి. ఇక ఇప్పుడు ఈ భామ గురించి ఇత‌ర హీరోలు కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికి అక్కినేని హీరోల‌కు తోడు అందాల ఆర‌బోత కూడా ఈ భామ‌కు క‌లిసొస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here