నా పేరు సూర్య‌.. ఇంపాక్ట్ అదిరిందిగా..!

ఈ రోజుల్లో టీజ‌ర్లు.. ట్రైల‌ర్లు విడుద‌ల చేయ‌డం కామ‌న్. కానీ కొత్త కొత్త పేర్లు పెట్టి విడుద‌ల చేస్తున్నారు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఆ మ‌ధ్య పైసావ‌సూల్ కోసం స్టంప‌ర్ అన్నాడు బాల‌కృష్ణ‌. ఇప్పుడు ఫ‌స్ట్ ఇంపాక్ట్ అంటూ వ‌చ్చాడు అల్లుఅర్జున్. ఈయ‌న దూకుడు చూసి అంతా షాక్ అవుతున్నారు. అస‌లు టీజ‌ర్ కాకుండా ఫ‌స్ట్ ఇంపాక్ట్ అని ఎందుకు అన్నాడో ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మైపోతుంది. కొడితే అలాగే మైండ్ లో ఫిక్సైపోవాల‌నేలా ఈ ఇంపాక్ట్ ఉంది. ప్ర‌భావం గ‌ట్టిగా ప‌డుతుంది కాబ‌ట్టే ఫ‌స్ట్ ఇంపాక్ట్ అని పెట్టాడు వ‌క్కంతం వంశీ. ఇందులో మ‌రో అర్జున్ రెడ్డిగా ఉన్నాడు బ‌న్నీ. కోపం ప‌ట్ట‌లేనంత ఉంటుంది ఈ పాత్ర‌కు. ఇలాంటి వాడు సైనికుడు అయితే ఎలా ఉంటుంద‌నేది క‌థ‌. రెగ్యుల‌ర్ గా బ‌న్నీ సినిమాల్లో చూసే కామెడీ.. డాన్సులు ఈ చిత్రంలో క‌నిపించ‌వు. టీజ‌ర్ చూస్తుంటేనే ఈ విష‌యం అర్థ‌మైపోతుంది. ప‌క్కా సీరియ‌స్ స్టోరీ ఇది.. పైగా నెరేష‌న్ కూడా ఇలాగే ఉంటుంద‌ని ఇంపాక్ట్ తోనే చూపించాడు ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ. నా పేరు సూర్య ఎప్రిల్ 27న విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఇంపాక్ట్ రేంజ్ లోనే సినిమా కూడా ఉంటుందేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here