నంద‌మూరి ఫ్యామిలీపై ప‌డిన నాగ‌శౌర్య‌..

అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే నిజం ఇప్పుడు. నిజంగానే ఈయ‌న నంద‌మూరి కుటుంబంపై ప‌డిపోయాడు. నాగ‌శౌర్య‌కు మొన్నటి వ‌ర‌కు ఉన్న ఇమేజ్ వేరు.. ఇప్పుడు ఉన్న ఇమేజ్ వేరు. ఒక్క సినిమాతో ఇండ‌స్ట్రీలో లెక్క‌లు మారిపోతుంటాయి. ఇప్పుడు నాగ‌శౌర్య విష‌యంలోనూ ఇదే జ‌రిగింది.

NAGA SOURYA NANDAMURI FAMILY

ఈయ‌న ఛ‌లో సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. 2018లో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇదే. ఈ సినిమా త‌ర్వాత నాగ‌శౌర్య మార్కెట్ కూడా బాగానే పెరిగిపోయింది. అయితే క‌ణంతో పాటు అమ్మ‌మ్మ‌గారిల్లు ఫ్లాపుల‌తో మ‌నోడు మ‌ళ్లీ వెన‌క‌బ‌డి పోయాడు. కానీ సినిమాల విష‌యంలో మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు శౌర్య‌. ఇప్పుడు సొంత బ్యాన‌ర్ లో న‌ర్త‌న‌శాల సినిమాతో ఆగ‌స్ట్ 30న వ‌స్తున్నాడు. పోటీగా వ‌స్తుందేమో అనుకున్న శైల‌జారెడ్డి అల్లుడు కూడా వాయిదా ప‌డ‌టంతో పండ‌గ చేసుకుంటున్నాడు శౌర్య‌. ఈ సినిమాతో శ్రీ‌నివాస్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం కానున్నాడు.

ఈ సినిమాతో పాటు తాజాగా ఇప్పుడు భ‌వ్య క్రియేష‌న్స్ లో ఓ సినిమా మొద‌లుపెట్టాడు శౌర్య‌. రాజా కొల‌స ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ సినిమాకు నారినారి న‌డుమ మురారి టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. అప్ప‌ట్లో జ‌గ‌ప‌తిబాబు న‌టించిన ఆయ‌న‌కిద్ద‌రు త‌ర‌హాలో ఈ క‌థ సాగుతుంద‌ని తెలుస్తుంది. ప‌ర్ ఫెక్ట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు రాజా. ఈ చిత్రంలో నివేదా ఓ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. మ‌రో హీరోయిన్ కోసం వేట సాగిస్తున్నారు. మొత్తానికి న‌ర్త‌న‌శాల‌.. నారినారి న‌డుమ మురారి అంటూ నంద‌మూరి టైటిల్స్ తో ర‌చ్చ చేస్తున్నాడు నాగ‌శౌర్య‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here