ద‌ర్శ‌కులంతా.. చిరంజీవి ఇంట‌..!

చిరంజీవి ఇప్పుడు పూర్తిగా మెగాస్టార్ అయిపోయాడు మ‌ళ్లీ. మ‌ధ్య‌లో కొన్నేళ్లు రాజ‌కీయాల్లోకి వెళ్లి కొంద‌రివాడు అనిపించుకున్న అన్న‌య్య‌.. ఇప్పుడు మ‌ళ్లీ అంద‌రివాడుగా మారే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. అందుకే ఇండ‌స్ట్రీ అంద‌రితోనూ క‌లిసిపోతున్నాడు. ప్ర‌తీ వేడుక‌కు వ‌స్తున్నాడు. ఇక ఇప్పుడు చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 22న ఈయ‌న ఇంటికి ద‌ర్శ‌కులు అంతా క్యూ క‌ట్టారు.
Directors celebrate Chiranjeevi birthday
ఈ త‌రం ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌డానికి చాలా ఆస‌క్తి చూపిస్తున్నాడు మెగాస్టార్. ఇప్ప‌టికే సురేంద‌ర్ రెడ్డితో సైరా న‌ర‌సింహారెడ్డి చేస్తున్నాడు. ఈ చిత్రం సెట్స్ పై ఉండ‌గానే కొర‌టాల శివ క‌థ‌కు కూడా ఓకే చెప్పాడు.. ఈ సినిమాతో పాటు బోయ‌పాటి శీను చెప్పిన క‌థ కూడా ఈయ‌న‌కు బాగా న‌చ్చేసింది.
ఈ రెండు సినిమాలు వ‌చ్చే ఏడాది మొద‌లు పెట్ట‌నున్నాడు మెగాస్టార్. 2020 వ‌ర‌కు కూడా త‌న డైరీ ఫుల్ అయ్యేలా చూసుకున్నాడు చిరంజీవి. ఇక ఈ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అని కొర‌టాల‌.. సుకుమార్.. బోయ‌పాటి.. వంశీ పైడిప‌ల్లి.. వ‌క్కంతం వంశీ.. బి గోపాల్ లాంటి ద‌ర్శ‌కులంతా చిరు ఇంటికి క‌దిలారు. అన్న‌య్య‌తో కాసేపు ముచ్చ‌టించి ఎలాంటి క‌థలు కావాలో తెలుసుకున్నారు. ఏమో త్వ‌ర‌లోనే వీళ్ళ‌లో ఎవ‌రో ఒక‌రు మెగాస్టార్ కు న‌చ్చే క‌థ తీసుకురావ‌చ్చు.. దానికి అన్న‌య్య ఓకే చెప్పనూ వ‌చ్చు. ఇక్క‌డ ఏదైనా జ‌ర‌గొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here