దేశం వ‌దిలేస్తున్న ఉయ్యాల‌వాడ‌.

syera

భార‌త‌దేశ తొలి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు దేశం దాటేస్తున్నాడు. సైరా కోసం యూర‌ప్ షెడ్యూల్ మొద‌లు కానుంది. అక్క‌డ లొకేష‌న్ల వేటలో బిజీగా ఉన్నాడు సినిమాటోగ్ర‌ఫ‌ర్ ర‌త్న‌వేలు. ఆయ‌న‌తో పాటు సురేంద‌ర్ రెడ్డి కూడా ఇప్పుడు ఫారెన్ వెళ్ల‌బోతున్నారు. అక్క‌డే నెల రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఈ మ‌ధ్యే సైరా మేజ‌ర్ షెడ్యూల్ పూర్తైపోయింది. అందుకే హ‌మ్మ‌య్యా అంటూ హాయిగా ఉన్నాడు మెగాస్టార్.

ఇప్ప‌టి వ‌ర‌కు గ్రెగ్ పావెల్ ఆధ్వ‌ర్యంలో ఫైట్ సీన్స్ కంపోజ్ చేసారు. ఇక ఇప్పుడు లీ విక్ట‌ర్ ఈ చిత్రం కోసం వ‌స్తున్నాడు. హాలీవుడ్ లో ఈయ‌న స్టార్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫ‌ర్. ఫారెన్ షెడ్యూల్ లో మొత్తం ఈయ‌నే ఫైట్స్ కంపోజ్ చేయ‌బోతున్నాడు. మ‌రోవైపు చిరు కూడా 63 ఏళ్ల వ‌య‌సులోనూ అస్స‌లు త‌గ్గ‌డం లేదు.

ఈ షెడ్యూల్లో బ్రిటీష్ వాళ్ల‌పై ఉయ్యాల‌వాడ పోరాడి మ‌రీ గ‌న్స్ అన్నీ దోచుకునే సీన్స్ గ‌త షెడ్యూల్లోనే ఇక ఇప్పుడు యూర‌ప్ షెడ్యూల్ ను కూడా మ‌రో స్థాయిలో ఉండాలని ప్లాన్ చేసిన సురేంద‌ర్ రెడ్డి.. అందులో మ‌రో హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ ను రంగంలోకి దించాడు. డిసెంబ‌ర్ లోపు షూటింగ్ అంతా ప‌ూర్తిచేసి వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా సినిమా విడుద‌ల చేయ‌బోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొత్తానికి ఈ షెడ్యూల్ త‌ర్వాత చాలా రిలాక్స్ డ్ గా క‌నిపిస్తున్నాడు చిరంజీవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here