దీపిక మొత్తానికే గుడ్ బై చెబుతుందా..?

ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వ‌చ్చింది అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు దీపిక తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఎప్పుడూ చేతిలో రెండు మూడు సినిమాల‌తో బిజీగా ఉండే దీపిక ప‌దుకొనే.. ప‌ద్మావ‌తి త‌ర్వాత ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు న‌టిస్తున్న జీరో సైతం ఎప్పుడో ఓకే చేసిన ప్రాజెక్ట్. ఇందులో షారుక్ ఖాన్ తో క‌లిసి న‌టిస్తుంది దీపిక‌. అనుష్క శ‌ర్మ మ‌రో హీరోయిన్.

Deepika-Padukone

ఇదిలా ఉంటే ఇర్ఫాన్ ఖాన్ హీరోగా విశాల్ భ‌ర‌ద్వాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు సైన్ చేసినా కూడా ఆయ‌న ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో అదిప్పుడు ఆగిపోయింది. దాంతో దీపిక జీరో త‌ప్ప మ‌రో సినిమా ఏదీ చేయ‌డం లేదు. ఉన్న‌ట్లుండి ఇలా సైలెంట్ అయిపోవ‌డం వెన‌క కార‌ణం ఆరా తీస్తే పెళ్లి చేసుకోవ‌డ‌మే అని కొంద‌రు అంటున్నారు.

ర‌న్ వీర్ సింగ్ ను న‌వంబ‌ర్ లో ఈమె పెళ్లి చేసుకోబోతుంది. అన్నీ కుదిర్తే న‌వంబ‌ర్ 11న వీళ్ల పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ముహూర్తాలు కూడా చూసి పెట్టారు. డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ త‌ర‌హాలోనే ఇటలీలో దీపిక‌-ర‌న్వీర్ పెళ్లి జ‌ర‌గ‌బోతుంది. దీపిక సినిమాలు ఒప్పుకోక‌పోవ‌డానికి ఇదో కార‌ణం అయితే మ‌రో కార‌ణం మెడనొప్పి. ఈమె ఆరోగ్యం స‌రిగ్గా లేనందుకే ఇప్పుడు సినిమాలు చేయ‌డం లేద‌ని తెలుస్తుంది.

అయితే దీపిక మేనేజ‌ర్ వ‌ర్గం మాత్రం ఇవేవీ స‌రైన కార‌ణాలు కావ‌ని చెబుతున్నారు. ఒక‌వేళ ఆమె పెళ్లి చేసుకున్నా కూడా కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి ఆమె సినిమాలు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం మంచి క‌థ‌లు రాక‌పోవ‌డ‌మే అని తెలుస్తుంది. త‌న‌ను ఎగ్జైట్ చేసే క‌థ‌లు లేనందుకే దీపిక ఏ సినిమా ఒప్పుకోవడం లేద‌ని చెబుతున్నారు వాళ్లు. మ‌రి చూడాలిక‌.. ఈ ముద్దుగుమ్మ మ‌న‌సు గెలిచే క‌థ‌లు ఎక్క‌డున్నాయో ఏమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here