థ‌మ‌న్.. ఓ రేర్ రికార్డ్.. 

SS THAMAN MOVIES FAST RACE
ఈ రోజుల్లో రికార్డులు సృష్టించ‌డం అంత ఈజీ కాదు. ముఖ్యంగా సంగీత ద‌ర్శ‌కుల‌కు. అయితే తాను ఉన్న‌దే రికార్డులు సృష్టించ‌డానికి అంటున్నాడు థ‌మ‌న్. ఇప్ప‌టికే 100 సినిమాల‌కు చేరువ‌గా వ‌స్తోన్న ఈ సంగీత ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు మ‌రో అద్భుత‌మైన రికార్డ్ సొంతం చేసుకుంటున్నాడు. ఫిబ్ర‌వ‌రి 9, 10న రాబోయే అన్ని సినిమాల‌కు థ‌మ‌నే సంగీత ద‌ర్శ‌కుడు. ఆ రెండు రోజుల్లో మూడు సినిమాలు వ‌స్తున్నాయి. అన్నింటికీ త‌న‌దైన మ్యూజిక్ ఇచ్చాడు థ‌మ‌న్. ఇప్ప‌టికే ఇంటిలిజెంట్ లోని ఛ‌మ‌క్ ఛ‌మ‌క్ రీమిక్స్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక మిగిలిన పాట‌ల‌కు ఓకే అనే టాక్ వ‌చ్చింది. మోహ‌న్ బాబు గాయ‌త్రిలోని పాట‌లు పెద్ద‌గా క్లిక్ కాలేదు కానీ ఆర్ఆర్ అదిరిపోయింది. ట్రైల‌ర్ లోనే ఈ విష‌యం అర్థ‌మైపోయింది. ఇక తొలిప్రేమ పాట‌ల‌కు మాత్రం రెస్పాన్స్ అదిరిపోయింది. చాలా రోజుల త‌ర్వాత థ‌మ‌న్ నుంచి ఫ్రెష్ మ్యూజిక్ వ‌చ్చింద‌ని అంతా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ కెరీర్ లోనే తొలిప్రేమ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇందులోని అల్ల‌సాని వారి ప‌ద్య‌మా పాట అయితే ఇప్ప‌టికే సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిపోయింది. ఇలా ఒకే వారం మూడు సినిమాలు వ‌స్తుంటే.. అన్నింటికీ థ‌మ‌నే సంగీతం అందించ‌డం మాత్రం నిజంగా అద్భుత‌మైన రికార్డే. ఇది ఇప్ప‌ట్లో ఎవ‌రూ ఛేదించ‌లేని రికార్డ్ కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *