త్రిష‌.. వాట్ ఎన్ ఆఫ‌ర్ స‌ర్జీ..?

కొంద‌రు హీరోయిన్లకు వ‌య‌సు అస్స‌లు పెర‌గ‌దు. వాళ్లు వ‌చ్చి ఏళ్ల‌కేళ్లు గ‌డుస్తున్నా కూడా అవ‌కాశాలు వ‌స్తూనే ఉంటాయి. త్రిష కూడా ఇదే లిస్ట్ లో ఉంటుంది. 15 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలోనే ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టికీ హీరోయిన్ గానే కొన‌సాగుతుంది. అయితే ఒక‌ప్ప‌టిలా ఇప్పుడు స్టార్ హీరోల‌తోనే న‌టిస్తాననే ప‌ట్టుద‌ల లేదు. స్టార్ ఇమేజ్ ఉన్న‌పుడే నేను ఇలాంటి పాత్ర‌లు మాత్ర‌మే చేస్తాను.. ఇవి చేయ‌ను.. నాక‌వి కావాలి.. ఇవి కావాలి.. అని గొంతెమ్మ కోర్కెలు.

THRISHA RAJINIKANTH OFFER

ఒక్క‌సారి ఇమేజ్ పోయిందంటే ఇండ‌స్ట్రీలో వ్యాల్యూ కూడా పోతుంది. ఒక‌ప్పుడు దండేసిన వాళ్లే.. ఇమేజ్ లేక‌పోతే క‌నీసం దండం కూడా పెట్ట‌రు. హీరోయిన్ల విష‌యంలోనూ అంతే. స్టార్ హీరోయిన్ గా ఉన్న‌పుడు వాళ్లు చేసే వేశాలు అన్నీ ఇన్నీ కావు. ఆ భ్ర‌మ‌లోనే ఉంటూ కొన్నాళ్లూ అవ‌కాశాలకు కూడా దూర‌మ‌వుతారు. త్రిష మాత్రం త‌న ఇమేజ్ ఏంటో ముందే తెలుసుకుంది. అందుకే చిన్న సినిమాలైనా ప‌ర్లేద‌ని అన్నింటికి ఓకే చెప్పేస్తుంది.

ఆ చిన్న సినిమాల్లోనూ అందాల ఆర‌బోత రెచ్చిపోయి చేస్తోంది. ఆ మ‌ధ్య క‌ళావ‌తిలో బికినీలో సెగ‌లు పుట్టించిన త్రిష‌.. ఈ మ‌ధ్యే మోహిని అనే ఊరుపేరు లేని సినిమాతో వ‌చ్చింది. ఇక ఇప్పుడు మాత్రం అదిరిపోయే ఆఫ‌ర్ అందుకుంది త్రిష‌. ఇన్నాళ్లూ క‌ల‌లు క‌న్న ర‌జినీకాంత్ ఇప్పుడు ఆఫ‌ర్ ఇచ్చాడు. సూప‌ర్ స్టార్ సినిమాలో త్వ‌ర‌లోనే జాయిన్ కానుంది ఈ ముద్దుగుమ్మ‌. కార్తిక్ సుబ్బ‌రాజ్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ లో అడుగు పెట్ట‌నున్న‌ట్లు టీమ్ ప్ర‌క‌టించారు.

మొత్తానికి కెరీర్ క్లోజ్ అనుకుంటున్న టైమ్ లో ర‌జినీకాంత్ సినిమాలో అవ‌కాశం అంటే మాట‌లు కాదు. అయితే ఇప్పుడు ర‌జినీ మున‌ప‌టి ఫామ్ లో లేక‌పోవ‌డం.. కార్తిక్ సినిమాపై అంచ‌నాలు త‌క్కువ‌గా ఉండ‌టం త్రిష‌కు క‌లిసిరావ‌డం లేదు. ఏదేమైనా ఇది ర‌జినీ సినిమా.. ఆ ఒక్క బ్రాండ్ చాలు.. మ‌ళ్లీ త్రిష కెరీర్ కొన్నాళ్లైనా గాడిన ప‌డ‌టానికి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here