చ‌ర‌ణ్ అలా వెళ్లిపోయాడేంటి.. ఏంటో మ‌రి..?

స్టార్ హీరోల సినిమా అంటే ఎప్పుడు మొద‌లై.. ఎప్ప‌టికి పూర్తి అవుతాయో క్లారిటీ ఉండ‌దు. ఎంత ప్లానింగ్ ఉన్నా కూడా మ‌ధ్య‌లో కొన్ని బ్రేకులు.. ఆ త‌ర్వాత కొత్త షెడ్యూల్స్ త‌ప్ప‌వు. ఇప్పుడు చ‌ర‌ణ్ కూడా ఇదే చేస్తున్నాడు. నిన్న‌టి వ‌ర‌కు ఈయ‌న హైద‌రాబాద్ లోనే షూటింగ్ చేసాడు. మ‌ధ్య‌లో కొన్ని రోజులు భార్య‌తో క‌లిసి బ్రేక్ కూడా తీసుకున్నాడు చ‌ర‌ణ్. ఇప్పుడు మ‌ళ్లీ బోయ‌పాటి సినిమాతో బిజీ అయిపోయాడు.

ram charan

ఆగ‌స్ట్ 15న కొత్త షెడ్యూల్ మొద‌లు పెట్టిన చ‌ర‌ణ్.. ఇప్పుడు మ‌రో షెడ్యూల్ కు రెడీ అయిపోయాడు. ప్ర‌స్తుతం ఈయ‌న షూటింగ్ యూర‌ప్ కు షిఫ్ట్ అయింది. అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ తెలుగు సినిమా చేయ‌ని దేశం అజ‌ర్ బైజాన్ లో కొత్త షెడ్యూల్ 25 రోజుల పాటు ప్లాన్ చేసాడు బోయ‌పాటి శీను. చ‌ర‌ణ్ తో పాటు మ‌రో 30 మంది టీం అక్క‌డికి వెళ్లారు.

అంటే మ‌రో నెల రోజుల వ‌ర‌కు చ‌ర‌ణ్ ఎవ‌రికీ క‌నిపించ‌డన్న‌మాట‌. ఈయ‌న‌తో పాటు ప్ర‌శాంత్, స్నేహ లాంటి వాళ్లు కూడా ఈ షెడ్యూల్ లో చ‌ర‌ణ్ తో పాటు వెళ్లారు. ఈ చిత్రానికి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ప‌రిశీలిస్తున్నాడు బోయ‌పాటి శీను. రంగ‌స్థ‌లం లాంటి సినిమా త‌ర్వాత మ‌రోసారి పూర్తి క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో వ‌స్తున్నాడు ఈ హీరో. ఈ చిత్ర బిజినెస్ కూడా 100 కోట్లకు చేరువ‌గానే జ‌రుగుతుంది. డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కానుక‌గా సినిమా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here