చైస్యామ్ స‌వాల్.. సోష‌ల్ మీడియా ట్రెండింగ్..

భార్యాభ‌ర్త‌లు అన్న త‌ర్వాత అన్నీ క‌లిసి పంచుకోవాలి. క‌ష్ట‌మైనా.. సుఖ‌మైనా. ఇప్పుడు చైతూ స్యామ్ కూడా ఇదే చేస్తున్నారు. ఇద్ద‌రూ ఒకేరోజు వ‌స్తుండ‌టం క‌ష్ట‌మే కానీ దాన్ని కూడా సుఖంగా మార్చుకుంటున్నారు ఈ ఇద్ద‌రూ. ఒక‌రి కోసం ఒక‌రు ప్ర‌మోష‌న్ కూడా చేసుకుంటున్నారు. స్యామ్ యు ట‌ర్న్.. నాగ‌చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానున్నాయి.

NAGA CHAITANYA SAMANTHA

ఇప్పుడు ఇదే చ‌ర్చ జ‌రుగుతుంది తెలుగు ఇండ‌స్ట్రీలో. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా కుమ్మేస్తున్నాయి ఈ రెండు సినిమాలు. లాంగ్ వీకెండ్ కాబ‌ట్టి క‌చ్చితంగా ఎన్ని సినిమాలు వ‌చ్చినా ప్రేక్ష‌కులు చూస్తారనే న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దాంతో స‌మంత అదే రోజు వ‌స్తుంది. ఇదే విష‌య‌మై ఇటు స‌మంత‌.. అటు చైతూ ఇద్ద‌రూ పోరు లైట్ తీసుకున్నారు.

తాను తొలిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తే వ‌చ్చి నాతోనే పోటీ ప‌డ‌తావా అంటూ స్యామ్ ఇంట్లో అరుస్తుంద‌ని చెప్పాడు చైతూ. ఆ త‌ర్వాత రెండూ రెండు డిఫెరెంట్ జోన‌ర్ సినిమాలు కాబ‌ట్టి క‌చ్చితంగా చూస్తార‌ని చైస్యామ్ ను ద‌ర్శ‌క నిర్మాత‌లు బ్రెయిన్ వాష్ చేసారు. దాంతో ఇప్పుడు యు ట‌ర్న్ కు చైతూ.. శైల‌జారెడ్డి అల్లుడుకు స‌మంత ప్ర‌మోష‌న్ చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతానికి అయితే శైల‌జారెడ్డి అల్లుడు కాస్త ఎడ్జ్ లో ఉన్నాడు.. భారీ అంచ‌నాల‌తో వ‌స్తున్నాడు. మ‌రోవైపు స‌మంత సినిమాను కూడా త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమా తొలిసారి చేసింది ఆమె. అంటే క‌థ‌పై ఎంత న‌మ్మ‌కం ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. దాంతో ఇప్పుడు ఈ రెండు సినిమాల కోసం అభిమానులు వేయి క‌ళ్ల‌తో చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here