చైతూ ఫీల‌వుతాడేమో.. అలా అనేసావేంటి స‌మంత‌..?

ఏదైనా ఓ మాట అనేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. మాట అనేది తుపాకి తూటా కంటే ప్ర‌మాదం. అలాంటి మాట‌ల‌ను ఇప్పుడు స‌మంత ఇలా వాడేసింది. అస‌లు ఈ భామ ఏం మాట్లాడిందో త‌న‌కైనా త‌ర్వాత క్లారిటీ వ‌చ్చిందో లేదో కానీ ఇండ‌స్ట్రీలో త‌న జ‌ర్నీ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ఈ భామ‌. ఇన్నేళ్ళ త‌న ఇండ‌స్ట్రీ ప్ర‌యాణంలో త‌న‌కు తోడెవ్వ‌రూ లేర‌ని చెప్పింది స్యామ్.

SAMANTHA

ఏ తోడు లేకుండా.. గాడ్ ఫాద‌ర్ ఎవ‌రూ లేకుండా ఇన్నేళ్లుగా స్టార్ గా ఎలా ఉన్నావ్ స‌మంత అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇండ‌స్ట్రీలో ఎవ‌రికోసం ఎవ‌రు సాయం చేయరు.. త్యాగం చేయ‌రు అని చెప్పింది స్యామ్.. నిజ‌మే కానీ క‌నీసం తోడు లేకుండానే ఇంత‌గా ఎదిగాను అని చెప్ప‌డం మాత్రం దారుణ‌మే. ఎందుకంటే స‌మంత‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంది తెలుగు ఇండ‌స్ట్రీ. గౌత‌మ్ మీన‌న్ లాంటి వాళ్లు స‌మంత కెరీర్ కు చాలా హెల్ప్ చేసారు. ఇక నాగ‌చైత‌న్య నాలుగు సినిమాల‌తో ఆమెకు ఇక్క‌డ లైఫ్ ఇచ్చాడు.

మ‌రోవైపు ఎన్టీఆర్ నాలుగు సినిమాలు.. మ‌హేశ్ మూడు సినిమాలు చేసాడు. స్టార్ హీరోల ప్రోత్సాహం లేకుండానే స‌మంత ప‌దేళ్లు ఇండ‌స్ట్రీలో ఉంటుందా..? ద‌ర్శ‌క నిర్మాత‌లు ప‌ట్టించుకోకుండా ఉంటే ఇప్పుడు అక్కినేని కోడ‌లి వ‌ర‌కు స్యామ్ కెరీర్ ఎదిగేదా అంటున్నారు అభిమానులు. అయితే తెలిసో తెలియ‌కో మాట జారేసింది కానీ త‌ర్వాత మాత్రం క‌చ్చితంగా త‌ను మాట్లాడింది త‌ప్పు అని తెలుసుకునే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌. అలా తెలుసుకోక‌పోతే మాత్రం లేనిపోని త‌ల‌నొప్పుల‌ను తెచ్చుకున్న‌ట్లే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here