చైతూపై స్యామ్ దే డామినేష‌న్..

పెళ్లికి ముందు వ‌ర‌కు ఎలా ఉన్నా ప‌ర్లేదు కానీ పెళ్లైన త‌ర్వాత మాత్రం క‌చ్చితంగా అబ్బాయిలు పెళ్లాలు చెప్పిన‌ట్లు న‌డుచుకుంటార‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. అవి ఎంత‌మంది న‌మ్ముతారో తెలియ‌దు కానీ ఇప్పుడు నిజంగా కొన్ని చూస్తుంటే న‌మ్మ‌క త‌ప్ప‌ట్లేదు. తెలుగు ఇండ‌స్ట్రీ క్యూటెస్ట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌, స‌మంత ఇప్పుడు వినాయ‌కుడి సాక్షిగా బాక్సాఫీస్ పోరుకు దిగారు. శైల‌జారెడ్డి అల్లుడుతో చైతూ వ‌స్తే.. యు ట‌ర్న్ తీసుకుంటు స‌మంత అడ్డొచ్చింది.

samantha and nagachaitanya

అయితే మారుతి ద‌ర్శ‌కుడు కావ‌డంతో ముందు నుంచి అంద‌రి చూపు శైల‌జారెడ్డి అల్లుడుపైనే ఉంది. ఇప్పుడు ఈ చిత్రానికి కోరుకున్న టాక్ అయితే రాలేదు. చైతూ ఇమేజ్ కు తోడు ర‌మ్య‌కృష్ణ స్క్రీన్ ప్ర‌జెన్స్ ఈ సినిమాను ఓపెనింగ్స్ వ‌ర‌కు ప‌రిమితం చేస్తాయేమో కానీ ఆ త‌ర్వాత నిల‌బెట్ట‌డం క‌ష్టంగా మారింది. మ‌రోవైపు యు ట‌ర్న్ సినిమాకు కూడా టాక్ చాలా బాగా వ‌చ్చింది.

స‌మంత లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి సందేశాత్మ‌క క‌థ ఓకే చేయ‌డంతో అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. క‌మ‌ర్షియ‌ల్ గా ఎలా ఉన్నా భ‌ర్త సినిమాతో పోలిస్తే భార్య‌కే ఎక్కువ మార్కులు ప‌డుతున్నాయి. అంద‌రూ స‌మంత సినిమా సూప‌ర్ అని అల్లున్ని పాత చింత‌కాయ ప‌చ్చ‌డి అంటున్నారు. దాంతో భ‌ర్త‌పై భార్య పై చేయి సాధించింది. నెమ్మ‌దిగా బాక్సాఫీస్ లెక్క‌ల్లో కూడా ఈ సినిమా దూకుడు ఎలా ఉండ‌బోతుంది అనేది తేల‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here