చివ‌రికి స‌మంత‌కే ప‌డిందిగా.. చైతూ షాక్..!

అనుకున్న‌ట్లుగానే స‌మంత సినిమానే టార్గెట్ చేసాడు నాగ‌చైత‌న్య‌. ఈయ‌న న‌టించిన కొత్త సినిమా శైల‌జారెడ్డి అల్లుడు ఆగ‌స్ట్ 31 నుంచి వాయిదా ప‌డింది. ఇది పాత విష‌య‌మే.. కానీ ఇప్పుడు కొత్త విష‌యం ఏంటంటే ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుంది. అదే రోజు ప్ర‌త్యేకంగా రావ‌డానికి కార‌ణం కూడా ఉంది. వినాయ‌క‌చ‌వితి హాలీడే క‌లిసొస్తుంద‌ని అదే రోజు త‌ను న‌టించిన యు ట‌ర్న్ సినిమాను విడుద‌ల చేస్తుంది స‌మంత. పాపం ఈ తేదీని ముందుగానే అనుకుంది ఈ భామ‌. కానీ ఇప్పుడు స‌డ‌న్ గా సీన్ లోకి నాగ‌చైత‌న్య వ‌చ్చాడు..

శైల‌జారెడ్డి అల్లుడు వాయిదా ప‌డిన రోజునుంచి కూడా రోజూ కంగారు ప‌డుతూనే ఉంది స‌మంత‌. అనుకున్న‌ట్లుగానే చివ‌రికి వ‌చ్చి ఇప్పుడు స‌మంత ఒళ్లోనే వాలిపోయాడు చైతూ. ఇంట్లో క‌లిసే ఉన్నా.. ఇప్పుడు మాత్రం బ‌య‌ట బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొట్లాడాల్సిందే. మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. లేదంటే స‌మంతే కాంప్రమైజ్ అయిపోయి త‌న చిత్రం పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో యు ట‌ర్న్ వాయిదా ప‌డితే మ‌ళ్లీ అంత మంచి డేట్ దొర‌క‌డం క‌ష్టం. అందుకే క‌ష్ట‌మైనా ప‌ర్లేదు కానీ భ‌ర్త‌పైనే యుద్ధానికి సిద్ధ‌మైంది ఈ అక్కినేని వారి కోడ‌లు. మ‌రి ఈ పోరులో విజ‌యం ఎవ‌ర్ని వ‌రిస్తుందో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here