గ‌ణేష్ ను పంపించారు.. నెక్ట్స్ అమిత్..!

4 రోజులుగా బిగ్ బాస్ ఇంట్లో ఉన్న గ‌ణేష్ బ‌య‌టికి వ‌చ్చాడు. సామాన్యుడిగా వెళ్లి అసామాన్యుడిగా మారి.. ర‌చ్చ చేసిన ఈ కుర్రాడి ప్ర‌యాణం బిగ్ బాస్ 2లో ముగిసిపోయింది. ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉండ‌టంతో గ‌ణేష్ ను బ‌య‌టికి పంపించేసారు. ముఖ్యంగా ఈయ‌న బ‌య‌టికి రావ‌డానికి కౌశ‌ల్ ఆర్మీ కార‌ణంగా క‌నిపిస్తుంది. ఆయ‌న‌తో గొడ‌వ పెట్టుకున్న వాళ్లు ఒక్కొక్కరిగా బ‌య‌టికి వ‌స్తుండ‌టంతో షోలో ఏదేదో జ‌రుగుతుంది.

KAUSHAL ARMY GANESH AMITH

గ‌త‌వారం ఓ టాస్క్ లో కౌశ‌ల్ తో కాస్త సీరియ‌స్ గా మాట్లాడాడు గ‌ణేష్. అప్పుడే ఫిక్స్ అయిపోయారు ఈ వారం బ‌య‌టికి వ‌చ్చేది గ‌ణేష్ అని. అయితే చివ‌ర్లో ట్విస్ట్ ఇస్తూ ఈ వారం ఒక్కరు కాదు.. ఇద్ద‌రు ఎలిమినేట్ అవుతారు అని నాని చెప్ప‌డంతో షాక్ అయ్యారంతా. ముందు గ‌ణేష్ వ‌చ్చేసాడు.. ఇప్పుడు ఆయ‌న‌కు తోడుగా ఈ వారం అమిత్ కూడా బ‌య‌టికి వ‌స్తున్నాడ‌ని తెలుస్తుంది.

నూత‌న్ నాయుడుకు బ‌య‌ట కౌశ‌ల్ ఆర్మీ స‌పోర్ట్ ఉంది. దాంతో ఈ వారం బ‌య‌టికి వ‌చ్చేంత డేంజ‌ర్ జోన్ లో ఉన్న‌ది ఈయ‌న ఒక్క‌డే. సామ్రాట్ ను ఎలాగూ సేఫ్ చేస్తారు ప్రేక్ష‌కులు.. ఇక నూతన్ బ‌తికిపోతున్నాడు.. ఎటు చూసుకున్నా ఈ వారం గ‌ణేష్ తో పాటు బ‌య‌టికి వ‌చ్చేది అమిత్ అని ఫిక్సైపోవ‌చ్చు. మ‌రి చూడాలిక‌.. కౌశ‌ల్ ఆర్మీ ర‌చ్చ రానురాను ఇంకెంత ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here