గాయత్రి చిత్రానికి UA సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సర్స్, ఫిబ్రవరి 9న భారీ విడుదల!

డా. మోహన్ బాబు ప్రధాన పాత్ర లో నటిస్తున్న ‘గాయత్రి’ చిత్రం సెన్సర్స్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఫిబ్రవరి 9 న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు అద్భుత స్పందన వస్తుంది.  మోహన్ బాబు ఇంటెన్స్ లుక్ మరియు పవర్ఫుల్ డైలాగులతో కూడిన ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని భారీగా పెంచేసాయి. ఎస్ తమన్ స్వరపరిచిన చిత్ర పాటలకు విశేష స్పందన వస్తుంది. గాయత్రిలో విష్ణు మంచు ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండటం చిత్రానికి మరో హైలైట్. శ్రియ ఆయన సరసన జంటగా మొదటి సరి నటించారు. మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల విమల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9 న మన ముందుకు రాబోతున్న గాయత్రీ చిత్రాన్ని డా.యమ్.మోహన్ బాబు తన ప్రతిష్టాత్మక బ్యానర్ అయిన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై నిర్మించగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.
సాంకేతిక వర్గం:
కథ-మాటలు: డైమండ్ రత్న బాబు
సంగీతం: ఎస్.ఎస్.తమన్,
ఛాయాగ్రహకుడు: సర్వేశ్ మురారి,
ఆర్ట్: చిన్న,
ఎడిటర్: ఎంఆర్ వర్మ,
ఫైట్స్: కనల్ కణ్ణన్,
కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య.
కో-డైరెక్టర్స్: అనిల్ కుమార్ కె.వి.ఎస్.ఎన్,రవి బయ్యవరపు
కో-రైటర్: రవి బయ్యవరపు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్
నిర్మాత: డా. మోహన్ బాబు యమ్.
దర్శకత్వం: మదన్ రామిగాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *