ఖాకీ రివ్యూ

తారాగణం: కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యు సింగ్, మనో బాల

దర్శకత్వం: H వినోత్

సంగీతం: ఘిబ్రన్

నిర్మాత: SR ప్రభు

బ్యానర్: డ్రీం వారియర్ పిక్చర్స్

కథ:

ధీరజ్ (కార్తీ) ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. అతని నిజాయితీ కి బహుమానం గా తరచు ట్రాన్స్ఫర్ లు అవుతుంటాయి. అతను తన భార్య ప్రియా (రకుల్) తో కలిసి ఓ కొత్త ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కాగా ఆ ఊరిలో తరచూ డెకాయిట్ లు దోపిడీలకు పాల్బడి దోచుకున్న ఇళ్లలోని కుటుంబాలను కిరాతకంగా చంపుతుంటారు. ధీరజ్ దర్యాప్తు ప్రారంభిస్తాడు. అయితే తవ్వే కొద్ది ఆ కేసు క్లిష్టంగా, పెద్దగా మారి దొంగలు ఉత్తరాదివారని తెలుస్తుంది. ధీరజ్ ఇతర పోలిసుల తో కలిసి కేసు ను ఎలా ఛేదిస్తాడు, దొంగలను ఎలా పట్టుకుంటాడనేదే చిత్రం.

కథనం:

ఖాకీ రొటీన్ పోలీస్ కథలకు బిన్నంగా ఉండే చిత్రం. 1995 కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో దర్శకుడు సహజత్వానికి దగ్గర గా తీసినట్లు కనిపిస్తుంది. చాలా రీసెర్చ్ చేసి ఓ డాక్యుమెంటరీ చిత్రానికి కాస్త ఎంటర్టైన్మెంట్ జోడించినట్లు ఉంటుంది. ప్రథమార్ధం మొత్తం చాలా వేగం గా థ్రిల్లింగ్ గా సాగుతుంది. కార్తీ, రకుల్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉన్న పాటలు మాత్రం బ్యాక్ గ్రౌండ్ లో వస్తాయి. ఉత్కంఠభరితమైన ఇంటర్వెల్ బ్లాక్ తో కథ మలుపు తిరుగుతుంది. ద్వితీయార్ధం కూడా అంతే ఇంటరెస్టింగ్ గా సాగుతుంది కానీ నిడివి ఎక్కువయినట్లనిపిస్తుంది. దర్యాప్తు చేసే విధానం చాలా లాజికల్ గా వాస్తవికంగా చూపించడం బాగుంది. కథలో లీనమై ఆలోచింపచేసేలా ఉంటాయి.

పెరఫార్మన్సెస్

ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ గా కార్తీ అద్భుత నటన ప్రదర్శించాడు. తన హావ భావాలూ, స్టైల్ కథనానికి బలనిచ్చాయి. రకుల్ తన బబ్లీ పెర్ఫార్మన్స్ తో సీరియస్ కథలో ఉత్సాహాన్ని నింపుతుంది. అభిమన్యు సింగ్ మరియు ఇతర దొంగల ముఠా సభ్యులు నిజంగా దొంగల అనేట్లుగా మభ్య పెడతారు.

సాంకేతిక అంశాలు:

ఘిబ్రన్ మ్యూజిక్ చిత్రానికి పెద్ద ప్లస్ అయ్యింది. సన్నివేశాలను మరింత ఉత్కంఠభరితంగా ఉండేలా ఉంటుంది అతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఒకటి రెండు పాటలు గుర్తుంది పోతాయి. యాక్షన్ సన్నివేశాలను ఆసక్తికరంగా తీసినందుకు ఛాయాగ్రాహకుడు సత్యం సూర్యం ను మెచ్చుకోవాలి.

చివరి మాట: ఖాకీ – వాస్తవానికి దగ్గరగా పవర్ఫుల్ పోలీస్ కథ

Comments are closed.