క‌త్తిలా ఉన్న క‌రీనా కూతురు..

అదేంటి.. క‌రీనా క‌పూర్ కు అంత పెద్ద కూతురు ఎక్క‌డుంది అనుకుంటున్నారా..? అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్నా ఇప్పుడు ఇదే నిజం. కరీనా కూతురే ఇప్పుడు త‌న అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తుంది. హాట్ హాట్ అందాల‌తో మ‌తులు చెడ‌గొడుతుంది. పైగా టెంప‌ర్ హిందీ రీమేక్ సింబాలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇక్క‌డ‌ క‌రీనా కూతురు అంటే సైఫ్ కూతురు అని అర్థం. సైఫ్ మొద‌టి భార్య కూతురు సారా అలీఖాన్ టెంప‌ర్ రీమేక్ సింబాలో హీరోయిన్ గా న‌టిస్తుంది. తెలుగులో ఎంతో సీరియ‌స్ గా సాగే ఈ చిత్రాన్ని హిందీలో కామెడీ చేస్తున్నాడు రోహిత్ శెట్టి. ఫ‌స్టాఫ్ అంతా కామెడీగా మార్చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

SARA ALI KHAN

ఇందులో సైఫ్ కూతుర్ని హీరోయిన్ గా తీసుకున్నాడు రోహిత్ శెట్టి. ఇప్ప‌టికే షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ లో నిర్మిస్తున్నాడు నిర్మాత క‌ర‌ణ్ జోహార్. 2018 డిసెంబ‌ర్ 28న సింబా విడుద‌ల కానుంది. ఆలోపు సినిమా విడుద‌ల‌కు ముందే త‌న అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తుంది సారా అలీఖాన్. అందాల నాటుసారాలా అంద‌రి మ‌న‌సులు చెడ‌గొడు తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక విడుద‌ల త‌ర్వాత ఆ ర‌చ్చ ఇంకే స్థాయిలో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. అస‌లే ఇప్పుడు బాలీవుడ్ లో వార‌సురాళ్ల హ‌వా బాగా పెరిగిపోయింది. మొన్న‌టికి మొన్న ఝాన్వీక‌పూర్ కూడా ధ‌డ‌క్ తో అంద‌రి దిల్ దోచేసింది. ఇప్పుడు సారా సిద్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here