క్రిష్ న‌లిగిపోతున్నాడు పాపం..

Krish-directing-Manikarnika-and-NTR-biopic

తెలిసి చేసినా.. తెలియ‌క చేసినా ఇప్పుడు తాను చేసిన ప‌నికి న‌లిగిపోతున్నాడు క్రిష్‌. ఈయ‌న ఒకేసారి రెండు సినిమాలు క‌మిట‌వ్వ‌డం చేసిన త‌ప్పు. ఓ సినిమా పూర్తైంద‌నుకుని మ‌రో సినిమా ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు పాత సినిమా ఇంకా పూర్తి కాక‌పోవ‌డంతో పాటు రీ షూట్ కూడా చేయాల్సి రావ‌డంతో ఇప్పుడు లేనిపోని తిప్ప‌లు వ‌స్తున్నాయి ఈ ద‌ర్శ‌కుడికి. మ‌ణిక‌ర్ణిక‌..

ఎన్టీఆర్ సినిమాల మ‌ధ్య ఇరుక్కుపోయాడు ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు. పూర్తైపోయింద‌నుకున్న మ‌ణికర్ణిక కొత్త షెడ్యూల్ ఇప్పుడు కోయంబ‌త్తూర్ లో జ‌రుగుతుంది. ఇక్క‌డ ఎన్టీఆర్ బ‌యోపిక్ తొలి షెడ్యూల్ పూర్తి చేసి కోయంబ‌త్తూర వెళ్లాడు క్రిష్. అక్క‌డ ప‌ని పూర్తిచేసి మ‌ళ్లీ ఇక్క‌డ ఎన్టీఆర్ రెండో షెడ్యూల్ మొద‌లు పెట్ట‌నున్నాడు. ఈ చిత్రం 2019 జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది. మ‌రోవైపు మ‌ణిక‌ర్ణిక జ‌న‌వ‌రి 25న విడుద‌ల కానుంది.

అంటే రెండు వారాల గ్యాప్ లో రెండు భారీ బయోపిక్ ల‌తో రానున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. దాంతో బాంబే టూ భాగ్య‌న‌గ‌రానికి చ‌క్క‌ర్లు కొడుతున్నాడు క్రిష్. ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ బ‌యోపిక్ అంటే క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌ని లేదు.. మ‌రోవైపు ఎన్టీఆర్ కూడా నేష‌న‌ల్ వైడ్ పాపుల‌ర్. దాంతో ఈ రెండు బ‌యోపిక్ ల‌పై భారీ అంచ‌నాలున్నాయి. మొత్తానికి ఈ రెండు బ‌యోపిక్ ల మ‌ధ్య భలే ఇరుక్కున్నాడు క్రిష్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here