కేరాఫ్ కంచరపాలెం.. టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ..!

కేరాఫ్ కంచ‌ర‌పాలెం.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఎవ‌ర్నీ క‌దిపినా కూడా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. విడుద‌ల‌కు రెండు రోజుల ముందు ప్రీమియ‌ర్ షో వేస్తేనే అమ్మో అనుకునే రోజులు ఇవి. అలాంటిది ఈ సినిమా షోస్ మాత్రం మూడు నెల‌ల ముందు నుంచి ప‌డుతున్నాయి. ఎప్పుడో సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల‌య్యే సినిమా కోసం జులై నుంచే ప్రీమియ‌ర్స్ వేయ‌డం మొద‌లు పెట్టాడు నిర్మాత రానా.

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో తొలిసారి రానా ద‌గ్గుపాటి స‌మ‌ర్పించు అని ప‌డుతుంది కేరాఫ్ కంచర‌పాలెం విష‌యంలో. వెంక‌టేశ్ మ‌హా తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోయింది. చూసిన ప్ర‌తీ ఒక్క‌రు కూడా అద్భుతం అంటూ పొగిడేస్తున్నారు. రాజ‌మౌళి.. కొర‌టాల‌.. సుకుమార్.. కీర‌వాణి.. క్రిష్.. ఇలా ఎవ‌ర్ని క‌దిపినా కూడా ఇప్పుడు ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు.

అంత‌గా త‌న క‌థ‌, స్క్రీన్ ప్లేతో మాయ చేసాడు ద‌ర్శ‌కుడు మ‌హా. పైగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేస్తున్న తీరు కూడా అద్భుత‌మే. రోజుకో షో రామానాయుడు స్టూడియోలో వేస్తున్నారు. సెలెబ్రెటీస్ తో పాటు ఇంకా చాలామంది ప్ర‌తీరోజు అక్క‌డ ఫ్రీ షో చూస్తున్నారు. చూసి ఆనందిస్తున్నారు. ఇప్పుడు కూడా స‌మంత‌, రాశీఖ‌న్నా లాంటి వాళ్ల‌కు ప్ర‌త్యేకంఆ షో వేసారు. సినిమా చూసి వాళ్లు కూడా సూప‌ర్ గా ఎంజాయ్ చేసారు. విడుద‌ల‌య్యే టైమ్ కు అది అద్భుతం అనే టాక్ తో బ‌య‌టికి రావాల్సిందే. పెళ్లిచూపులు.. మెంట‌ల్ మ‌దిలో లాంటి సినిమాలు కూడా ఇదే చేసారు అప్పుడు. మ‌ళ్లీ కేరాప్ కంచ‌ర‌పాలెంకు కూడా ఇదే చేస్తున్నారు. కంచ‌ర‌పాలెం అనే ఊళ్ళోనే.. అక్క‌డే ఉన్న ఊరి వాళ్ల‌తోనే ఈ సినిమా తెర‌కెక్కించాడు వెంక‌టేశ్ మ‌హా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here