కంచ‌ర‌పాలెం కుర్రాళ్లేం చేస్తారు.. సిల్లీఫెలోస్ ప‌రిస్థితేంటో..?

ప్ర‌తీ వారం మాదిరే ఈ వారం కూడా చిన్న సినిమాలు బోలెడు వ‌స్తున్నాయి. వాటిపై అంచ‌నాల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ముందు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ వ‌ర‌కు ర‌ప్పించే సినిమాలు ఉన్నాయా అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈ వారం కూడా అన్నీ చిన్న సినిమాలే వ‌స్తున్నాయి.

ముఖ్యంగా అల్ల‌రి న‌రేష్ సిల్లీఫెలోస్ సినిమాపై ఈ వారం అంచ‌నాలు బాగానే ఉన్నాయి కానీ ఈయ‌న ట్రాక్ రికార్డ్ మాత్రం సినిమాపై ఆస‌క్తి త‌గ్గిస్తుంది. భీమినేని శ్రీ‌నివాసరావు సుడిగాడు త‌ర్వాత మ‌రోసారి న‌రేష్ తో చేసిన సినిమా ఇది. పైగా సునీల్ ప‌దేళ్ల త‌ర్వాత పూర్తిస్థాయి క‌మెడియ‌న్ గా వ‌స్తున్నాడు.

దాంతో ఈ సినిమా ఏం చేయ‌బోతుందో అనే అంచ‌నాలు అయితే అన్నిచోట్లా క‌నిపిస్తున్నాయి. దానికితోడు ఇదే వారం వ‌స్తున్న కేరాఫ్ కంచ‌ర‌పాలెం అయితే మూడు నెల‌ల నుంచి ర‌చ్చ చేస్తుంది. ఈ సినిమాను అదే ప‌నిగా ప్ర‌మోట్ చేస్తూనే ఉన్నారు చిత్ర‌యూనిట్. ముఖ్యంగా సురేష్ బాబు అయితే మ‌రో ప‌నేదీ పెట్టుకోలేదు ఈ చిత్రం విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు. అయితే ఇది ఎంత‌వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ వ‌ర‌కు ర‌ప్పిస్తుంద‌నేది ఆస‌క్తిక‌ర‌మే. దాంతోపాటు చాందిని చౌద‌రి మ‌ను కూడా ఈ వార‌మే వ‌స్తుంది. అయితే ఇది వ‌స్తున్న‌ట్లు కూడా చాలామందికి తెలియ‌దు. మొత్తానికి ఈ మూడు సినిమాల్లో ఏది ఈ వారం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందో చూడాలిక‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here