కంగ‌న కావాల‌నే చేస్తుందా.. మ‌రి క్రిష్ ప‌రిస్థితేంటి..?

తెలిసి చేసినా.. తెలియ‌క చేసినా ఇప్పుడు తాను చేసిన ప‌నికి న‌లిగిపోతున్నాడు క్రిష్‌. ఈయ‌న ఒకేసారి రెండు సినిమాలు క‌మిట‌వ్వ‌డం చేసిన త‌ప్పు. ఓ సినిమా పూర్తైంద‌నుకుని మ‌రో సినిమా ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు పాత సినిమా ఇంకా పూర్తి కాక‌పోవ‌డంతో పాటు రీ షూట్ కూడా చేయాల్సి రావ‌డంతో ఇప్పుడు లేనిపోని తిప్ప‌లు వ‌స్తున్నాయి ఈ ద‌ర్శ‌కుడికి. మ‌ణిక‌ర్ణిక‌.. ఎన్టీఆర్ సినిమాల మ‌ధ్య ఇరుక్కుపోయాడు ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు. పూర్తైపోయింద‌నుకున్న మ‌ణికర్ణిక రీ షెడ్యూల్ మ‌ళ్లీ జ‌రుగుతుంది. దాంతో అక్క‌డ క్రిష్ ఉండ‌లేక‌పోతున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఉండ‌టంతో మ‌ణిక‌ర్ణిక‌ను వ‌దిలేసాడు ఈ ద‌ర్శ‌కుడు.

Kangana Ranaut
దాంతో బాలీవుడ్ ద‌ర్శ‌కుల సాయంతో తానే డైరెక్ట్ చేసుకుంటుంది కంగ‌న‌. ముందు ఈ చిత్రాన్ని తానే తెర‌కెక్కించాల‌నుకున్నా.. అనుకోకుండా క్రిష్ సీన్ లోకి వ‌చ్చాడు. ఇప్పుడు అనుకున్న‌దే చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రోవైపు ఇక్క‌డ ఎన్టీఆర్ బ‌యోపిక్ తో క్రిష్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం 2019 జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది. మ‌రోవైపు మ‌ణిక‌ర్ణిక జ‌న‌వ‌రి 25న విడుద‌ల కానుంది. అంటే రెండు వారాల గ్యాప్ లో రెండు భారీ బయోపిక్ ల‌తో రానున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. దాంతో బాంబే టూ భాగ్య‌న‌గ‌రానికి చ‌క్క‌ర్లు కొడుతున్నాడు క్రిష్. ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ బ‌యోపిక్ అంటే క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌ని లేదు.. మ‌రోవైపు ఎన్టీఆర్ కూడా నేష‌న‌ల్ వైడ్ పాపుల‌ర్. దాంతో ఈ రెండు బ‌యోపిక్ ల‌పై భారీ అంచ‌నాలున్నాయి. మొత్తానికి ఈ రెండు బ‌యోపిక్ ల మ‌ధ్య భలే ఇరుక్కున్నాడు క్రిష్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here