ఒక్కడు మిగిలాడు రివ్యూ

తారాగణం: మంచు మనోజ్, అనిషా అంబ్రోస్

దర్శకత్వం : అజయ్ ఆండ్రూస్ నూతక్కి

సంగీతం: శివ ఆర్ నందిగం

నిర్మాత : లక్ష్మి కాంత్

బ్యానర్: పద్మజ ఫిలిమ్స్

కథ:

ముగ్గురు యూనివర్సిటీ విద్యార్థులు అత్యాచారానికి గురవ్వడంతో సూర్య(మనోజ్) తోటి విద్యార్థులతో కలిసి ఆందోళన చేపడతాడు . పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి హింసిస్తారు. ఆ ముగ్గురు అమ్మాయిలు శ్రీలంక నుండి వచ్చిన కాందిశీకులని, వారి విషాద గతాన్ని వివరిస్తాడు సూర్య. శ్రీలంక లోని ప్రచండ యుద్ధ కాలంలో కెప్టెన్ పీటర్ తమిళుల విమోచనం, హక్కుల కోసం పోరాటం సాగిస్తాడు. శ్రీలంక సైనికుల అరాచకాలను భరించలేక కొంతమంది పడవలో భరత్ కు ప్రయాణం అవుతారు. ఆ శరణార్ధుల ఉనికి కోసం చేసే జీవన మరణ పోరాటమే ఒక్కడు మిగిలాడు కథాంశం.

కథనం:

చిత్రం మనోజ్ ఇంటరాగేషన్ తో మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో శ్రీలంక యుద్ధ సన్నివేశాలు అబ్బుర పరుస్తాయి. తమిళ కాందిశీకుల పై శ్రీలంక సైనికుల అరాచకాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. శరణార్ధుల భాదలు వారి ఆవేదన చూపరులకు కంట తడిపెట్టక మానదు. ద్వితీయార్ధం చాలావరకు కథ పడవలో సాగడం విశేషం. కాందీశీకుల సాహాసోపేత సముద్ర ప్రయాణం కట్టిపడేస్తుంది. చాల హృదయ విదారక, బరువైన సంఘటనలతో ఏ విధమైన కామెడీ గాని రొమాన్స్ కు గాని తావు లేకుండా ఎమోషనల్ గా సాగుతుంది మొత్తం చిత్రం.

తారాబలం:

రెండు పాత్రల్లో మనోజ్ అద్భుత నటన కనబరిచారు. ప్రత్యేకం గా కెప్టెన్ పీటర్ పాత్రకోసం ఆయన ఆవేశభరిత హావ భావాలూ అమోఘమని చెప్పాలి. తన పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ మరియు డైలాగ్ డెలివరీ తో ఉద్వేగానికి గురి చేస్తుంది.అనిషా అంబ్రోస్ చిన్న పాత్రే అయినా బాగానే చేసింది. పోసాని & సుహాసిని తప్ప మిగతా వలందరు కొత్తవాళ్లే పనిచేసారు.

సాంకేతికత:

ఒక్కడు మిగిలాడు మూస కమర్షియల్ చిత్రాలకు బిన్నంగా తీయబడిన చిత్రం. శ్రీలంక ప్రచండ యుద్ధం నాటి పరిస్థితులను నేటి తరానికి తెలుపాలనే సదుద్దేశం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దానికోసం వారు పడ్డ శ్రమ అభినందనీయం. యుద్ధ సన్నివేశాలు వాస్తవానికి దగ్గరగా చిత్రీకరించారు. సముద్రంలో పడవ ప్రయాణం హాలీవుడ్ స్థాయిలో థ్రిల్లింగ్ గా చిత్రీకరించారు. కమర్షియల్ హంగులేమి లేకుండా నిజాయితీగా చిత్రాన్ని తెరకెక్కించినందుకు దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నుత్తకి ని మెచ్చుకోవాలి. ఛాయాగ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఎమోషనల్ సన్నివేశాలను మరింత రక్తికటించాయి.

చివరి మాట: వాస్తవానికి దగ్గరగా యద్ధార్ద వీరగాథ

Comments are closed.