ఏంటి రాశీఖ‌న్నాను టార్గెట్ చేస్తున్నారా..?

పాపం అమాయ‌కంగా ఉంటుంది.. ఆ భామేం చేసింది.. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారా..? ఇది సినిమా ఇండ‌స్ట్రీ ఎప్పుడు ఎవ‌రు ఎక్క‌డ్నుంచైనా టార్గెట్ చేస్తారు. ఇక్క‌డ ఎవ‌రైనా ఎదుగుతున్నారు అంటే తొక్కే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతుంటాయి. ఇప్పుడు రాశీఖ‌న్నా విష‌యంలో ఇదే జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. అస‌లే వ‌ర‌స ప్లాపుల్లో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు ఓ అగ్ర నిర్మాత కావాల‌నే ఇండ‌స్ట్రీలో బ్యాడ్ చేస్తున్నాడ‌ని తెలుస్తుంది.

RASHI KHANNA

అంద‌రికీ ప‌ని గ‌ట్టుకుని ఫోన్ చేసి మ‌రీ.. రాశీకి అవ‌కాశాలు ఇవ్వొద్ద‌ని ఆర్డ‌ర్ వేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ నిర్మాత‌తో ఈ మ‌ధ్యే ఓ సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఈ సినిమాకు రెమ్యున‌రేష‌న్ భారీగా తీసుకోవ‌డం.. పైగా ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వ‌డంతో ఆ కోపం ఎవ‌రిమీద చూపించాలో తెలియ‌క ఇప్పుడు రాశీ మీద ప‌డ్డాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.
ఎలాగూ ఇండ‌స్ట్రీని ఏలుతున్న నిర్మాతే కాబ‌ట్టి క‌చ్చితంగా అంద‌రూ ఈయ‌న మాట వింటార‌నే అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు రాశీఖ‌న్నా కూడా త‌న సినిమాల‌ విష‌యంలో పెద్ద‌గా ప‌ట్టింపులు లేన‌ట్లు క‌నిపిస్తుంది.

కారెక్ట‌ర్ న‌చ్చితే కావాలంటే పారితోషికం త‌గ్గించుకోడానికి రెడీ అంటుంది. ఎందుకంటే తొలిప్రేమ లాంటి హిట్ త‌ర్వాత శ్రీ‌నివాస క‌ళ్యాణంతో మ‌రో ఫ్లాప్ అందుకుంది ఈ భామ‌. దాంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టి మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని చూస్తుంది. అన్న‌ట్లు ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క్రాంతిమాధ‌వ్ తెర‌కెక్కించ‌బోయే సినిమాలో న‌టించ‌బోతుంది రాశీఖ‌న్నా. మ‌రి నిజంగానే ఈ భామ కెరీర్ ని ముగించ‌డానికి కుట్ర చేస్తున్నారేమో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here