ఎఫ్ 2.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్..!

అనిల్ రావిపూడి ఇప్పుడు చేస్తున్న సినిమా ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌నా.. లేదంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్సా.. ఏమో ఇప్పుడు తీరు చూస్తుంటే కాస్త అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఈ చిత్ర షూటింగ్ అప్పుడే స‌గానికి పైగా పూర్తైపోయింది. ప‌క్కా ప్లానింగ్ తో అంద‌రికీ పిచ్చెక్కిస్తున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ ఇందులో హీరోలుగా న‌టిస్తున్నారు. ప్ర‌తీ షెడ్యూల్లోనూ అంద‌రూ క‌లిసే ఉంటున్నారు.

Fun and Frustration

స్క్రిప్ట్ లో అంద‌రికీ స‌మాన హ‌క్కు ఇచ్చిన‌ట్లున్నాడు అనిల్. వ‌రుణ్ తేజ్ తొలిరోజు నుంచే ఉంటే.. వెంకీ నాలుగు రోజుల త‌ర్వాత షూట్ లో అడుగు పెట్టాడు. ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత నాన్ స్టాప్ షెడ్యూల్ తో దుమ్ము లేపుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని అనిల్ ఆస్థాన నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సింపుల్ గా లుంగీ క‌ట్టుకుని ర‌చ్చ చేసారు వీళ్ళంతా. వెంకీ కూడా రాగానే అదే చేసాడు. ఆ త‌ర్వాత కార్పోరేట్ స్టైల్ లో కుమ్మేసారు. వ‌రుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్.. వెంకీకి జోడీగా త‌మ‌న్నా న‌టిస్తున్నారు.

ఇక ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ పెరెగ్వేకు షిఫ్ట్ అయింది. అక్క‌డే ప‌ది రోజుల పాటు షెడ్యూల్ ను ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు అనిల్. ఆయ‌న‌తో పాటు నిర్మాత శిరీష్ కూడా ఉన్నాడు. హీరోయిన్ల‌ను రిపీట్ చేయ‌డం అనిల్ కు ఉన్న అల‌వాటు. ప‌టాస్ హీరోయిన్ శృతిసోథితో సుప్రీమ్ లో ఐటం సాంగ్ చేయించాడు.. ఇక సుప్రీమ్ హీరోయిన్ రాశీఖ‌న్నాతో రాజా ది గ్రేట్ లో చిన్న స్టెప్ వేయించాడు. ఇప్పుడు రాజా ది గ్రేట్ హీరోయిన్ మెహ్రీన్ కు మ‌రో ఛాన్స్ ఇస్తున్నాడు. ఇక వెంక‌టేశ్ కు జోడీగా త‌మ‌న్నాను తీసుకున్నాడు. సీనియ‌ర్ హీరోయిన్ ఎవ‌రైనా మ‌రీ రొటీన్ అయిపోతుంద‌ని భావించిన అనిల్ రావిపూడి.. కొత్త‌గా ఉంటుంద‌ని త‌మ‌న్నాను సెట్ చేసాడు. పైగా ఇప్పుడు త‌మ‌న్నాకు కూడా పెద్ద‌గా ఆఫ‌ర్లు లేవు. ఇలాంటి టైమ్ లో వెంక‌టేశ్ తో అవ‌కాశం అంటే చిన్న‌దేం కాదు. పైగా ఇప్పుడు త‌మ‌న్నా కూడా సీనియ‌ర్ హీరోయినే క‌దా..? ఈ చిత్రం 2019 జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here