ఎన్టీఆర్ కు ప‌రామ‌ర్శ‌.. ఫారెన్ నుంచి వ‌చ్చిన మ‌హేశ్..!

మ‌హేశ్ బాబు ఇన్ని రోజులు ఫారెన్ లో ఉన్నాడు. మ‌హ‌ర్షి షూటింగ్ లో కాస్త టైమ్ దొర‌క‌డంతో ఫ్యామిలీతో పాటు టూర్ వెళ్లాడు ఈ హీరో. అయితే హ‌రికృష్ణ మ‌ర‌ణంతో టాలీవుడ్ అంతా షాక్ లోకి వెళ్లిపోయింది. అంతా అక్క‌డే ఉన్నారు. ఒక్క మ‌హేశ్ మాత్ర‌మే ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

MAHESH-BABU

ఈయ‌న దేశంలో లేక‌పోవ‌డంతో ఇప్పుడు విష‌యం తెలుసుకుని వ‌స్తున్నారు. ఆగ‌స్ట్ 31న వ‌చ్చీ రాగానే ముందు ఎన్టీఆర్ ను క‌ల‌వ‌నున్నారు సూప‌ర్ స్టార్. ఆయ‌న కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన త‌ర్వాత బిఏ రాజు ఇంటికి వెళ్ల‌నున్నారు. ఈయ‌న భార్య.. ద‌ర్శ‌కురాలు బి జ‌య ఆగ‌స్ట్ 30 రాత్రి ఆక‌స్మికంగా మ‌ర‌ణించారు. రాజు కుటుంబానికి మ‌హేశ్ అత్యంత స‌న్నిహితుడు. దాంతో రాజుగారి కుటుంబాన్ని కూడా ఓదార్చ‌నున్నాడు మ‌హేశ్ బాబు. హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత త‌న సోద‌రుడికి దేవుడు ధైర్యం ఇవ్వాలంటూ ట్వీట్ చేసాడు మ‌హేశ్ బాబు. అలాగే రాజుగారి కోసం కూడా క‌ద‌ల్తున్నాడు సూప‌ర్ స్టార్. మొత్తానికి రెండు రోజుల గ్యాప్ లో మ‌హేశ్ రెండు షాకింగ్ వార్త‌లు వినాల్సి వ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here