ఈ రియాక్ష‌న్ అస్సలు ఊహించ‌లేదు క‌దా శౌర్య‌..?

కింగ్ సినిమాలో శ్రీ‌నివాస్ రెడ్డి, బ్ర‌హ్మానందం మ‌ధ్య‌లో ఓ సీక్వెన్స్ ఉంటుంది. ఈ స్థాయిలో రియాక్ష‌న్ అస్స‌లు ఊహించ లేదు క‌దా మీరు అంటూ బ్ర‌హ్మ‌ని అడుగుతాడు శ్రీ‌నివాస్ రెడ్డి. గుర్తొచ్చింది క‌దా.. ఇప్పుడు శౌర్య‌ను కూడా అంతా ఇదే అడ‌గాల‌నుకుంటున్నారు. దానికి కార‌ణం కూడా బ‌లంగానే ఉంది. న‌ర్త‌న‌శాల విడుద‌లకు ముందు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో.. ఇప్పుడు అంత‌గా నీరుగారిపోయాడు ఈ కుర్ర హీరో.
NAGA SHOURYA NARTHANASALA
ఈ సినిమా క‌చ్చితంగా త‌న‌కు 15 కోట్ల మార్కెట్ తీసుకొస్తుంది అని బాగా న‌మ్మాడు పాపం ఈ కుర్రాడు. అందుకే కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ చ‌క్ర‌వ‌ర్తి చెప్పిన క‌థ న‌మ్మి గుడ్డిగా గే పాత్ర‌లోకి దూరిపోయాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఊహించిన రేంజ్ కాదు క‌దా.. క‌నీసం అందులో పావువంతు కూడా చేరుకోలేక‌పోతుంది.
ఇంత‌గా ఓ క‌థ‌ను ఎలా మిస్ జ‌డ్జ్ చేసానా అని ఇప్పుడు జుట్టు పీక్కుంటున్నాడు నాగ‌శౌర్య‌. ఛ‌లో వ‌చ్చిందనే ధైర్యంతో ఈ చిత్రాన్ని ఏకంగా 10 కోట్ల‌కు కొనేసారు బ‌య్య‌ర్లు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే క‌నీసం 4 కోట్లు కూడా వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు గీత‌గోవిందం ఇప్ప‌టికీ దున్నేస్తూనే ఉంది. దాంతో శౌర్య‌కు షాక్ త‌ప్ప‌డం లేదు. త‌న సినిమా న‌చ్చ‌క‌పోతే మీరే మ‌రో ప‌ది మందికి చెప్పండి అంటూ ప్రేక్ష‌కుల‌కు హింటిచ్చాడు నాగ శౌర్య‌.
ఇప్పుడు చూసిన త‌ర్వాత ఆడియ‌న్స్ చేస్తున్న ప‌ని కూడా ఇదే. ఏదేమైనా మ‌నోడు ప్రేక్ష‌కుల నుంచి ఈ రేంజ్ రియాక్ష‌న్ మాత్రం ఊహించ‌లేదు. అందుకే వీలైనంత త్వ‌ర‌గా న‌ర్త‌న‌శాల ఫ‌లితం మ‌రిచిపోయి.. త‌ర్వాతి సినిమాపై దృష్టి పెట్టేసాడు. రాజా కొల‌స‌తో నారినారి న‌డుమ మురారితో పాటు ర‌మ‌ణ తేజ అనే కొత్త ద‌ర్శ‌కుడితో త‌న సొంత బ్యాన‌ర్ లోనే మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు నాగ‌శౌర్య‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here