ఈ డోస్ స‌రిపోతుందా త్రివిక్ర‌మ్ గారూ..?

అజ్ఞాత‌వాసి త్రివిక్ర‌మ్ కెరీర్ కు మామూలు షాక్ కాదు. ఈ సినిమాతో దెబ్బ‌కు మ‌నోడి మార్కెట్ అంతా ప‌డిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు పొగ‌డ్త‌లు త‌ప్ప తిట్లు తెలియ‌ని మాట‌ల మాంత్రికుడికి చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నాడు క‌దా.. 25వ సినిమా క‌దా.. క‌నీసం ఆ మాత్రం జాగ్రత్త‌లు లేకుండా ఇలాంటి సినిమా ఎలా చేసాడు అంటూ త్రివిక్ర‌మ్ ను బాగానే ఎక్కేసారంతా. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో అర‌వింద స‌మేత సినిమా చేస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు.

అజ్ఞాత‌వాసిని మ‌రిపించ‌డానికో లేదంటే తానే ఆ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా మ‌ర్చిపోవాల‌నుకుంటున్నాడో తెలియ‌దు కానీ ద‌స‌రాకు వ‌స్తున్నాడు ఈ సినిమాతో. ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్ చూస్తుంటే మాత్రం త్రివిక్ర‌మ్ పెద్ద‌గా మారిన‌ట్లైతే క‌నిపించ‌డం లేదు. ఈ టీజ‌ర్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. విడుద‌లైన క్ష‌ణం నుంచే సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నా.. అక్క‌డ రికార్డ్ వ్యూస్ సాధిస్తున్నా కూడా టీజ‌ర్ లో ఏముంటుందో అని ఊహించుకున్న అభిమానుల‌కు మాత్రం ఇలా ఉంటుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు.

రొటీన్ ఫ్యాక్ష‌న్ క‌థ‌నే మ‌ళ్లీ చేస్తున్నాడేమో అనిపించేంత రొటీన్ గా టీజ‌ర్ ను క‌ట్ చేయించాడు ద‌ర్శ‌కుడు. ఇదే తీరు సినిమాలో కూడా ఉంటే అమ్మో ఊహించుకోడానికి కూడా భ‌యంగా ఉంది. అయితే త్రివిక్ర‌మ్ ఎప్పుడూ చేసిన త‌ప్పు చేయ‌డు. అందుకే అజ్ఞాత‌వాసి విష‌యంలో జ‌రిగిన ప్ర‌తీ చిన్న పొర‌పాట‌ను కూడా మ‌ళ్లీ స‌రిదిద్దుకునే ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here