ఇలియానా ఇక్క‌డే ఉంటుందా..?

రీ ఎంట్రీ ఇచ్చేవ‌ర‌కు ఓ అనుమానం.. ఇచ్చిన త‌ర్వాత మ‌రో అనుమానం. ఇప్పుడు ఇలియానా తెలుగు ఇండ‌స్ట్రీలోనే ఉంటుందా.. లేదంటే ర‌వితేజ సినిమాతో ఏదో చుట్ట‌పుచూపుగా న‌టించి వెళ్లిపోతుందా..? ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఇదే అనుమానం ఉంది. ఎంద‌కుంటే త‌మ సినిమాల్లోనూ ఇలియానాను తీసుకోవాలంటే ఆమె ఏం అంటుందో తెలియ‌క తిక‌మ‌క ప‌డుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

అయితే ఇప్పుడు ఆమె ఉన్న రేంజ్ ను మ‌న నిర్మాత‌లు త‌ట్టుకుంటారా అనేది అనుమాన‌మే. ఎందుకంటే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కోసం ఖాళీగా ఉన్న ఇల్లీని తీసుకొచ్చి ఏకంగా రెండుకోట్లు చదివించుకున్నారు మైత్రి మూవీ మేక‌ర్స్. మ‌ళ్లీ అందులో హోట‌ల్ బిల్స్.. అమ్మ‌గారి సౌక‌ర్యాలు కూడా అద‌నం. అవ‌న్నీ కాకుండానే రెండు కోట్ల‌కు పైగా ఇలియానా రెమ్యున‌రేష‌న్. ఇదే అమౌంట్ ఇస్తే పాత ఇలియానా ఎందుకు.. కొత్త పూజాహెగ్డేలే ఎగురుకుంటూ వ‌స్తారు క‌దా అంటున్నారు కొంద‌రు నిర్మాత‌లు. మ‌రోవైపు గోవాబ్యూటీ కూడా ర‌వితేజ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు ఇండ‌స్ట్రీ వైపు వ‌చ్చే ఆలోచ‌న‌లు చేయ‌డం లేదు.

బాలీవుడ్ లోనే త‌న జెండా అంటుంది ఈ బ్యూటీ. ఇప్ప‌టికే ముంబై వెళ్లి అక్క‌డే సెటిల్ అయిపోయింది గోవాభామ‌. ప్ర‌స్తుతం హిందీలో ఒక్క సినిమా కూడా ఇలియానా చేతుల్లో లేదు. కానీ ఖాళీగా ఉంటాను కానీ తెలుగు ఇండ‌స్ట్రీకి మాత్రం రానంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ర‌వితేజ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ మ‌ధ్యే అమెరికా నుంచి ముంబై వ‌చ్చింది ఈ జ‌ఘ‌న సుంద‌రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *