ఇప్పుడు మారుతి ప్లాన్ ఏంటి..?

మారుతి అంటే ఇన్నాళ్ళూ హిట్ డైరెక్ట‌ర్. ఈయ‌న చేసిన ఏ సినిమా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య్య‌ర్ల‌ను దారుణంగా ముంచేయ‌లేదు.. అలాగ‌ని ప్ర‌తీ సినిమా భారీ లాభాలు కూడా తీసుకురాలేదు. పెట్టిన డ‌బ్బుల‌ను వెనక్కి తెచ్చాయి.. ఒక‌ట్రెండు సినిమాలు భారీ లాభాలు కూడా తీసుకొచ్చాయి. ముఖ్యంగా భ‌లేభ‌లే మ‌గాడివోయ్ లాంటి సినిమాలు అయితే క‌లెక్ష‌న్ల పంట పండించాయి.

Director Maruthi Next Movie Project

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయ‌న తెర‌కెక్కించిన శైల‌జారెడ్డి అల్లుడు ప‌రిస్థితి మ‌రోలా మారిపోయింది. ఈ చిత్రం వీకెండ్ వ‌ర‌కు వ‌సూళ్లు బాగా తీసుకొచ్చింది కానీ ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి మారిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు 15.20 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌చ్చింది ఐదు రోజుల్లో. నిజానికి చైతూ సినిమాకు ఈ రేంజ్ వ‌సూళ్లు ఎక్కువే. కానీ శైల‌జారెడ్డి అల్లుడు చేసిన బిజినెస్ తో పోలిస్తే ఇది త‌క్కువే.

ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే మ‌రో 10 కోట్లు కావాలి. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అవి రావ‌డం దాదాపు అసాధ్యం. దాంతో మారుతికి చాలా రోజుల త‌ర్వాత ఫెయిల్యూర్ క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈయ‌న ఏం చేస్తాడ‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తి క‌లిగించే అంశం. ఇప్ప‌టికే సాయిధ‌రంతేజ్ కోసం క‌థ సిద్ధం చేస్తున్నాడ‌నే వార్త‌లు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రాలేదు. మ‌రోవైపు అఖిల్ కోసం కూడా మారుతి క‌థ వండుతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఏదేమైనా కొన్ని రోజుల త‌ర్వాత కానీ త‌న త‌ర్వాతి సినిమాపై క్లారిటీ ఇవ్వ‌లేనంటున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. మ‌రి శైల‌జారెడ్డి అల్లుడు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోడానికి మారుతికి ఎన్ని రోజులు ప‌డుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here