“ఇంద్రసేన ” కు యు/ఎ, నవంబర్ 30న గ్రాండ్ రిలీజ్

Vijay Antony Indrasena Telugu Theatricals Bagged By Neelam Krishna Reddy NKR Films - Audio Launch on Nov 16

విజయ్ ఆంథోని తన ప్రతి సినిమాకు వైవిధ్యమైన కధలను ఎంచుకుంటూ తెలుగులో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. లెటెస్ట్ గా “ఇంద్రసేన ” గా నవంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ట్రైలర్ , జిఎస్టీ
సాంగ్ తో పాటు ముందుగానె పది నిమిషాల సినిమాను ఇండస్ట్రీ వర్గాల వారికి చూపించటంతో ఇంద్రసేన ఇండస్ట్రీ లొ హాట్ టాపిక్ గా మారింది. బ్రదర్ సెంటిమెంట్ నేపధ్యంలో ఇంటెన్స్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వస్తొన్న ఇంద్రసేన విడుదలకు ముందే కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది. ఎన్.కె.ఆర్ ఫిలింస్ పతాకంపై
నీలం లక్ష్మి సమర్పణలొ నీలం కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంద్రసేన కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం. అన్నదమ్ముల అనుబంధం నేపధ్యంలో అద్యంతం ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కింది .మదర్ సెంటిమెంట్ తొ వచ్చిన బిచ్చగాడు కంటే బ్రదర్ సెంటిమెంట్ తో వస్తొన్న ఇంద్రసేన ఆడియెన్స్ ను మరింతగా ఆకట్టుకుంటుంది. జిఎస్టీ సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికెట్ తో నవంబర్ 30న తెలుగు తమిళ భాషల్లొ ఇంద్రసేన గ్రాండ్ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు

విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి,
సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, సమర్పణ : నీలం లక్ష్మి, నిర్మాతలు:నీలం కృష్ణారెడ్డి, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *