ఇంక సునీల్ ను ప‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..

హీరోగా ఉన్న‌పుడు సినిమా భారం అంతా సునీలే మోయాలి. అది ఫ్లాప్ అయితే ఆ భారం అంతా ఈయ‌న నెత్తిపైనే ప‌డేది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ ఈయ‌న క‌మెడియ‌న్ అయిపోయాడు. ఇప్పుడు విడుద‌లైన సిల్లీఫెలోస్ ఫ‌లితం ఎలా వ‌చ్చినా కూడా సునీల్ సూప‌ర్ హిట్ అయ్యాడు. ప‌దేళ్ల త‌ర్వాత క‌మెడియ‌న్ గా వ‌చ్చినా కూడా ఇప్ప‌టికీ అదే న‌వ్వులు పూయించి ఔరా అనిపించాడు. దాంతో ఇప్పుడు సునీల్ కోసం మ‌ళ్లీ ద‌ర్శ‌కుల వేట మొద‌లైంది. ఈయ‌న కోసం కారెక్ట‌ర్లు రాయ‌డం షురూ చేసారు. ఇన్నాళ్లూ ఈయ‌న క‌మెడియ‌న్ గా చేసినా కూడా ఎంత‌వ‌ర‌కు ప్రేక్ష‌కులు ఒప్పుకుంటారు అని చిన్న అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు అది తీరిపోయింది.

sunil

దాంతో సునీల్ ఇంక ప్ర‌శాంతంగా క‌మెడియ‌న్ గా కంటిన్యూ అయిపోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌ర‌స సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టిస్తున్న అర‌వింద స‌మేత.. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఇలా వ‌ర‌స‌గా రిలీజ్ కానున్నాయి. ఇందులో కీల‌క‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు ఈ భీమ‌వ‌రం బుల్లోడు. ఈ స‌రికొత్త సునీల్ ను చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత చేస్తోన్న సినిమాల‌న్నీ ఇప్పుడు వేగంగా షూట్ జ‌రుపుకుంటున్నాయి. అయితే ఇన్నేళ్ళ త‌ర్వాత వ‌చ్చినా కూడా అదే రేంజ్ పారితోషికం తీసుకుంటూ అద్బుతాలు చేస్తున్నాడు సునీల్. అప్పుడెప్పుడో 2013లో పూల‌రంగ‌డితో వ‌చ్చిన విజ‌యం.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు.

ఈ ఐదేళ్ల‌లో ఎన్ని సినిమాలు చేసినా ప్రేక్ష‌కులు మాత్రం సునీల్ ను చూడ‌లేక‌పోయారు. దాంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్ గా ఎంట్రీ ఇస్తున్నాడు సునీల్. ఈ విష‌యంలో చాలా సీరియ‌స్ గా ఉన్న సునీల్.. రీ ఎంట్రీని మాత్రం ఘ‌నంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అజ్ఞాత‌వాసి మిస్సైనా.. ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాలో న‌టిస్తున్నాడు. దాంతోపాటు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. శ‌ర్వానంద్ ప‌డిప‌డి లేచే మ‌న‌సు.. అల్ల‌రిన‌రేష్ సిల్లీఫెల్లోస్ లాంటి సినిమాల్లో న‌టిస్తున్నాడు సునీల్. సాయిధ‌రంతేజ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించ‌బోయే చిత్ర‌ల‌హ‌రి.. బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా న‌టిస్తున్నాడు. అప్పుడు ఏడాదికి ఒక్క సినిమా చేసి పారితోషికం తీసుకున్న సునీల్.. ఇప్పుడు రోజుకు 4 ల‌క్ష‌ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడ‌ని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here