ఆ ద‌ర్శ‌కున్ని బ‌న్నీ ఇంకా న‌మ్మ‌లేదుగా..

మూడు నెల‌లుగా నెక్ట్స్ ఏంటో తెలియ‌క త‌ల ప‌ట్టుకున్నాడు బ‌న్నీ. ఈయ‌న నెక్ట్స్ ఏంటో ఈయ‌న‌కే తెలియ‌దు. అడిగితే త‌న‌కు తెలిస్తే క‌దా చెప్ప‌డానికి అంటున్నాడు. విక్రమ్ కే కుమార్ తో పాటు పూరీ జగన్నాథ్.. కొరటాల శివ.. శేఖర్ కమ్ముల చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఏదీ వర్కవుట్ కాలేదు. విక్రమ్ సినిమా ఇప్పుడు వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే అంటున్నారంతా. ఫైన‌ల్ స్టేజ్ లో ఈ సినిమా ఉంద‌ని.. త‌ప్పుకుండా ఇదే బ‌న్నీ త‌ర్వాతి సినిమా అవుతుంద‌ని అంటున్నారంతా. అయితే అఫీషియ‌ల్ గా చెప్పేవ‌ర‌కు ఏదీ న‌మ్మ‌లేం.

Allu Arjun

అయితే ఇప్పుడు బ‌న్నీ కోసం మ‌రో ద‌ర్శ‌కుడు కూడా చూస్తున్నాడు. అత‌డే ప‌రుశురామ్.. కేరాఫ్ గీత‌గోవిందం. గీత‌గోవిందం స‌క్సెస్ త‌ర్వాత ఈయ‌న కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూస్తున్నారు. అయితే ఈయ‌న చూపు మాత్రం బ‌న్నీపై ఉంది. గీత‌గోవిందం ఇంత పెద్ద విజ‌యం సాధించినా కూడా ఆయ‌న‌పై అల్లుఅర్జున్ మ‌న‌సు పెట్టిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఓ సినిమా ఇవ్వొచ్చ‌నే న‌మ్మ‌కం అయితే చూపించ‌డం లేదు ఈ అల్లు వార‌బ్బాయి.

దాంతో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అది కూడా గీతాఆర్ట్స్ లోనే ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇన్నాళ్లూ చిన్న హీరోల‌తోనే సినిమాలు చేస్తూ వ‌చ్చిన ఈ ద‌ర్శ‌కుడు.. గీత‌గోవిందంతో స్టార్ లీగ్ లోకి ఎంట‌ర్ అయ్యాడు. కెరీర్ లో చాలా వ‌ర‌కు మంచి సినిమాలే చేసినా కూడా ఎందుకో కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రుశురామ్ కు రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. ఇప్పుడు అది గీత‌గోవిందంతో వ‌చ్చింది. దాన్ని కొన‌సాగించాల‌ని చూస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here