ఆగ‌స్ట్ 24.. బాక్సాఫీస్ అంతర్యుద్ధం..

చిన్న సినిమాలన్నీ మ‌ళ్లీ బాక్సాఫీస్ పైకి దండ‌యాత్ర‌కు రెడీ అవుతున్నాయి. అన్నీ ఒకేసారి వ‌స్తున్నాయి. మ‌రీ ఊరుపేరు తెలియ‌ని సినిమాలు అయితే కావు.. అలాగ‌ని భారీ సినిమాలు కూడా కావు. ఆగ‌స్ట్ 24న నాలుగు సినిమాలు విడుద‌ల కానున్నాయి. అందులో అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సిన సినిమా ఆది పినిశెట్టి నీవెవ‌రో.

AUG 24 MOVIES WAR

త‌మిళ్ లో హిట్టైన అదే కంగ‌ళ్ సినిమాకు ఇది రీమేక్. కోన‌వెంక‌ట్ నిర్మాత‌గా ఉంటూ స్క్రీన్ ప్లేతో పాటు మాట‌లు కూడా రాసాడు ఈ సినిమాకు. తాప్సీ, రితికా సింగ్ హీరోయిన్లు. కొత్త ద‌ర్శ‌కుడు హ‌రినాథ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఆగ‌స్ట్ 24న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఆది ఈ మ‌ధ్య ఫామ్ లో ఉండ‌టం ఈ సినిమాకు క‌లిసొచ్చే అంశం. ఇక ఇదే సినిమాతో పాటు నారా రోహిత్ ఆట‌గాళ్లు సినిమా కాస్త స్టార్స్ తో నిండిపోయి ఉంది. ఒక‌ప్పుడు నీ స్నేహం.. పెద‌బాబు లాంటి సినిమాలు చేసిన ప‌రుచూరి ముర‌ళి దీనికి ద‌ర్శ‌కుడు కావ‌డం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పుట్టిస్తుంది.

ఇక నారా రోహిత్ తో పాటు జ‌గ‌ప‌తిబాబు కూడా ఉండ‌టం బ‌లం. ఈ సినిమాతో పాటే అదేరోజు అదే రోజు ప్ర‌భుదేవా ల‌క్ష్మి సినిమా విడుద‌ల‌వుతుంది. ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కించిన ఈ చిత్రం వ‌స్తున్న‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. పెద్ద‌గా అంచ‌నాలు కూడా లేవు. ఇక ఎప్ప‌ట్లాగే ర‌ష్మి అందాల‌పైనే పూర్తిగా ఆశ‌లు పెట్టుకుని వ‌చ్చేస్తున్న మ‌రో సినిమా అంత‌కుమించి. త‌న వంతు అయినంత వ‌ర‌కు గ్లామ‌ర్ షో చేసింది ఈ భామ‌.

ఇక ఇప్పుడు ర‌ష్మి ఫ్యాన్స్ ఈ సినిమాను ఎంత‌వ‌ర‌కు ఆద‌రిస్తారో చూడాలి. అయితే ఎంత‌మంది వ‌చ్చినా కూడా గీత‌గోవిందం ముందు నిల‌బ‌డ‌తాయా అనేది అనుమాన‌మే. ఎందుకంటే ఈ సినిమా ఇప్ప‌టికీ దున్నేస్తుంది. చూస్తుంటే రెండో వారం కూడా ఏ సినిమాను క‌నీసం బ‌తక‌నిచ్చేలా కూడా క‌నిపించ‌డం లేదు. మ‌రి దీని ధాటికి త‌ట్టుకుని నిల‌బ‌డే ద‌మ్ము ఆ సినిమాల్లో ఉందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here